Dil Raju : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ఈవెంట్ నిన్న గ్రాండ్ గా నిర్వహించింది. ఈవెంట్ ను ప్రొడ్యూసర్ దిల్ రాజు దగ్గరుండి నడిపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన థాంక్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అవార్డుల వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ముందు 2024 వరకే అవార్డులు ఇవ్వాలని అనుకున్నాం. కానీ తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి అవార్డులు ఇవ్వాలనే డిమాండ్స్ రావడంతో ఆ సినిమాలకు కూడా ఇచ్చాం. కమిటీలో చాలా భిన్నాభిప్రయాలు వచ్చాయి. ప్రతి సినిమాను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో వివరణ ఇస్తూ.. చివరకు సెలెక్ట్ చేశాం.
Read Also : Allu Arjun : ‘శక్తిమాన్’ గా బన్నీ.. అంతా ఉత్తదే..!
ఈ అవార్డుల సెలక్షన్స్ కోసం చాలా విషయాలను పరిగణలోకి తీసుకున్నాం. ఒక్క మిస్టేక్ రావొద్దని జాగ్రత్త పడ్డాం. గత ఆరు నెలల నుంచి ఈ అవార్డల కోసం గ్రౌండ్ వర్క్ చేశాం. చివరకు నిన్న అవార్డులు అందజేశాం. ఈ వేడుక ఇంత గ్రాండ్ గా జరగడానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా సహకరించారు. వారికి స్పెషల్ థాంక్స్.
అవార్డులు అందుకోవడానికి నిన్న ఈవెంట్ కు వచ్చిన వారందరికీ స్పెషల్ థాంక్స్. ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలచుకున్నా. ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి అవార్డులు వచ్చినప్పుడు కచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎంత పెద్ద స్టార్ అయినా ఈవెంట్ కు వచ్చి అవార్డులన స్వీకరించాలి. నిన్న ఈవెంట్ లో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని మా దృష్టికి వచ్చింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అవి జరిగాయి. ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి. త్వరలోనే ఏపీ నుంచి అవార్డులు వస్తాయి. వాటిని కూడా మనం గౌరవిస్తూ స్వీకరించాలి’ అంటూ చెప్పుకొచ్చారు.
Read Also : The Rajasaab : ది రాజాసాబ్ టీజర్ డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
