Dil Raju: సిగ్గు, నీతి, మానం లేనిదే సినిమా.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ను శాసిస్తున్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. హిట్ సినిమా ఏ భాషలో ఉన్నా కానీ దాన్ని తెలుగువారికి అందించడం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇక దిల్ రాజుకు ఎంత పాపులారిటీ ఉందో .. అంతే విమర్శలు అందుకుంటున్నాడు. తన సినిమాకు తప్ప వేరే సినిమాలకు థియేటర్లు ఇవ్వడని ఇండస్ట్రీ టాక్. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నింటిని పంచుకున్నాడు. దిల్ రాజు అసలు పేరు వెంకట రమణా రెడ్డి అంట.. చిన్నతనం నుంచి ఇంట్లో రాజు అని పిలవడం.. దిల్ సినిమాతో హిట్ అందుకోవడంతో దిల్ రాజుగా సెటిల్ అయిపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఇక తాను నిర్మాతగా ప్రయాణం మొదలు పెట్టి 20 ఏళ్లవుతోందని, తనతో పాటు రియల్ ఎస్టేట్ లో ప్రయాణం మొదలు పెట్టిన వాళ్లు ఎక్కడో వున్నారు..తాను మాత్రం ఇక్కడే వున్నానని చెప్పుకొచ్చాడు.
ఇక డిస్ట్రి బ్యూటర్లకు సినిమా చూపించకుండానే అమ్మేస్తారని స్పష్టం చేసిన హార్ట్ కింగ్ డిస్ట్రిబ్యూషన్ రంగం పతనం అవుతోందంటే దానికి ప్రధాన కారణం నిర్మాతలే అని చెప్పి షాక్ ఇచ్చారు. ఇక సినిమా అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పుకొచ్చాడు దిల్ రాజు. సి అంటే సిగ్గు, నీ అంటే నీతి, మా అంటే మానం లేకుండా ఉండబట్టే సినిమా అనే పేరు వచ్చిందేమో అని చెప్పుకొచ్చాడు. ఇక వారసుడు వివాదం గురించి మాట్లాడుతూ ఈ వివాదాలను ఎవరు సృష్టిస్తున్నారో తనకు తెలుసనీ, ఓపెన్ గా తాను ఎవరినీ కౌంటర్ చేయను.. చేయలేదు కూడా అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
- Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
తాజావార్తలు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?