Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju: దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైస్’. ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ చేరుకూరి భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. నిజానికి ఈ చిత్రంపై అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు భారిగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొనగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకునేందుకు రూ.110 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం ఈ డీల్‌పై అఫిషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఒకవేళ ఈ డీల్ నిజమైతే, నాని కెరీర్లోనే అత్యంత భారీ థియేట్రికల్ డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇండస్ట్రీలో ఉన్న నమ్మకం, అంచనాలకు ఇది నిదర్శనమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ‘దసరా’ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన కాన్సెప్ట్ వీడియో ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో, నాని ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను పెంచింది. మరోవైపు ‘ది ప్యారడైజ్’ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా కాయదు లోహర్ నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు. కథ, మేకింగ్, సాంకేతిక విలువల విషయంలో మేకర్స్ ఎలాంటి రాజీ లేకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాట్లు సమాచారం. ఇదే కారణంగా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ బిజినెస్ జరుగుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దిల్ రాజు రూ.110 కోట్లకు థియేట్రికల్ రైట్స్ హక్కులు కొనుగోలు చేస్తున్నారనే వార్తపై చిత్రబృందం లేదా నిర్మాతల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. దీంతో ఈ డీల్‌పై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!