NTV Telugu Site icon

Dil Raju : ఆదిపురుష్ విషయంలో దిల్ రాజు ఊహించిందే జరిగిందా…?

Whatsapp Image 2023 06 18 At 11.53.09 Am

Whatsapp Image 2023 06 18 At 11.53.09 Am

ప్రభాస్ రాఘవుడి గా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జానకి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రూపొందించి తాజాగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.రికార్డు స్థాయి వసూళ్ల ను ఈ సినిమా సాధిస్తుందని అంతా కూడా భావించారు.కానీ ఇప్పుడు ఆ సినిమా పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా బడ్జెట్ రికవరీ చేయడం గొప్ప విషయం అన్నట్లుగా అయితే అనిపిస్తుంది.ఆదిపురుష్ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు దాదాపుగా 185 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే.

కానీ ఇప్పుడు పీపుల్స్ మీడియా వారికి ఎంత లాభం వస్తుందో అని ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా ను కొనుగోలు చేయాల్సిందిగా మొదట దిల్ రాజును సంప్రదించారు అంటూ ఆ మధ్య కొన్ని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.కానీ దిల్ రాజు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు . పీపుల్స్ మీడియా వారు కొనుగోలు చేసిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఏరియా ను ఇచ్చేందుకు రెడీ అన్నట్లుగా అయితే పేర్కొన్నారు. కానీ దిల్ రాజు మాత్రం అస్సలు ఆసక్తి చూపించలేదు. శాకుంతలం సినిమా ను చేసి దాదాపుగా నలభై కోట్ల రూపాయల నష్టాలను చూసిన దిల్ రాజు  అలాంటి ప్రయోగం అస్సలు వద్దు అన్నట్లుగా ఆదిపురుష్ ను సున్నితంగా తిరష్కరించాడని తెలుస్తుంది.. సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో కూడా దిల్ రాజు పాల్గొన్నాడు. అప్పటికి దిల్ రాజు కు ఆదిపురుష్ ను కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది.. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ మరియు తన శాకుంతలం సినిమా ప్రభావమో కానీ ఆదిపురుష్ సినిమా ను కొనుగోలు చేసేందుకు ఆయన అస్సలు సాహసం చేయలేదు. టాలీవుడ్ లో తాను నిర్మిస్తున్న సినిమాలు అలాగే తమిళంలో నిర్మిస్తున్న సినిమా లపై ప్రభావం పడే అవకాశం ఉందని అందుకే ఆదిపురుష్ ను వదులుకున్నట్లు దిల్ రాజు కాంపౌండ్ వారు  చెప్తున్నట్లు సమాచారం.. కానీ ఆదిపురుష్ విషయంలో నమ్మకం లేకపోవడం వల్లే దిల్ రాజు కొనుగోలు చేయలేదు అని ఇప్పుడు ఆయన భయం నిజమయిందని సోషల్ మీడియా లో ఈ వార్తలు వైరల్ అవుతుంది.

Show comments