Site icon NTV Telugu

Dil Raju : డిజాస్టర్ల హీరోతో దిల్ రాజు సినిమా ప్లానింగ్

Dil Raju

Dil Raju

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ పరంపర కొనసాగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన వరుస డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్న ఒక బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఇప్పటికే దిల్ రాజు హిందీలో కూడా కొన్ని సినిమాలు చేశారు. అలాగే గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న అమీర్ ఖాన్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Sri Reddy: శ్రీరెడ్డిపై పోలీస్ కేసు

దిల్ రాజు కాంపౌండ్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్న వంశీ పైడిపల్లి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే లైన్ గా చెప్పిన కథ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తో రమ్మని అంజి పైడిపల్లికి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వంశీ పైడిపల్లి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేశాడని త్వరలోనే ముంబై వెళ్లి ఆయనకు నరేష్ ఇవ్వబోతున్నాడని చెబుతున్నారు. ఒక సోషల్ ఇష్యూ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని, ఒక యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని అంటున్నారు. ఒకవేళ ఈ సినిమా గనక ఫైనలైతే అది వంశీ పైడిపల్లి కెరియర్ లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఆయన డీల్ చేసిన అన్ని సినిమాల్లోకి ఇది అత్యంత భారీ సినిమాగా నిలవనుంది.

Exit mobile version