NTV Telugu Site icon

Dil Raju : మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ ప్రొడ్యూసర్… ఇదుగో సాక్ష్యం !

Dil Raju

Dil Raju

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారు. ఈ విషయం గురించి ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బయటకొచ్చిన ఓ పిక్ చూస్తుంటే దిల్ రాజు – తేజస్విని జంట నిజంగానే తల్లిదండ్రులు కాబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా కుమారుడి వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరగ్గా, ఈ వేడుకకు సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఇందులో భాగంగానే దిల్ రాజు జంట అక్కడ కన్పించారు. వధూవరులను ఆశీర్వదించి, ఫోటోలు కూడా దిగారు. ఈ ఫొటోల్లో ఆకుపచ్చ, ఎరుపు రంగు చీర ధరించిన తేజస్విని బేబీ బంప్ క్లియర్ గా కన్పిస్తోంది. దీంతో దిల్ రాజు ఇంట మరోమారు ఆనందం వెల్లివిరియబోతోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆయనకు ఒక కుమార్తె హర్షిత ఉన్న విషయం తెలిసిందే. హర్షిత పెళ్ళై, ఒక బాబుకు తల్లి కూడా. దీంతో ఆల్రెడీ కుమార్తె ఉంది కాబట్టి దిల్ రాజు ఇంట ఈసారి వారసుడు అడుగు పెట్టబోతున్నాడా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Read Also : Salaar Pics Leak : సోషల్ మీడియాలో వైరల్

దిల్ రాజు తన కెరీర్‌ని డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభించి, స్టార్ నిర్మాతగా మారాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు. 2017లో ఆయన మొదటి భార్య చనిపోవడంతో వైఘా రెడ్డి(తేజస్విని)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. COVID-19 లాక్‌డౌన్ సమయంలో దిల్ రాజు… వైఘా రెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు దిల్ రాజు కుటుంబ సభ్యులు బేబీని ఆహ్వానించడానికి రెడీ అవుతున్నారు.

Show comments