సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన త్రినాధ్ రావు నక్కిన ఇటీవల మజాకాతో మరో హిట్ కొట్టాడు. ఓ వైపు ఈ సినిమా థియేటర్ లో ఉండగానే ఈ బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాధ రావు నక్కిన తన తదుపరి సినిమాను లైన్ లో పెట్టాడు. అందుకోసం ఈ సారి దిల్ రాజు కాంపౌండ్ లో అడుగుపెట్టాడు నక్కిన. గతంలో వీరి కాంబోలో హలొ గురు ప్రేమ కోసమే వంటి హిట్ సినిమా వచ్చింది.
Also Read : The RajaSaab : చివరిదశ షూటింగ్ లో రాజాసాబ్.. రిలీజ్ డౌటే..?
దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఈ కాంబో సెట్ అయింది. దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ ను హీరోగా నిలిపేందుకు కష్టపడుతున్నాడు దిల్ రాజు. ఈ హీరో నటించిన రౌడీబాయ్స్ అంతగా ఆకట్టుకోలేదు, లవ్ మీ కూడా ఫ్లాప్ గా మిగిలింది. సెల్ఫిష్ అనే మరో సినిమా స్టార్ట్ చేసి అవుట్ ఫుట్ సరిగా లేదని అలా పక్కన పెట్టేసాడు దిల్ రాజు. ఈ నేపధ్యంలో ఆశీష్ కు ఎలాగైనా హిట్ ఇవ్వాలని కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల స్పెషలిస్ట్ త్రినాధ రావుకు ఆ భాద్యతలు అప్పగించారు దిల్ రాజు. అయితే నక్కిన త్రినాధ రావు సినిమా అంటే బెజవాడ ప్రసన్న కథ అందించాల్సిందే. కానీ ఈ సినిమాకు మాత్రం బెజవాడ ప్రసన్నను పక్కన పెట్టేసారు. ఆశిష్ చేసే సినిమాకు స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కథ అందిస్తున్నాడు. మరి హరీష్ కథతో ఆశిష్ కు నక్కిన హిట్ అందిస్తాడో లేదో.