Dilraju : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్లే తాను నష్టాల నుంచి బయటపడ్డట్టు దిల్ రాజు తెలిపారు. తాజాగా ఆయన నిర్మిస్తున్న మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ప్రమోషన్లలో దిల్ రాజు షాకింగ్ విషయాలను బయట పెడుతున్నాడు. గత సంక్రాంతి సీజన్ లో రాజు నుంచి రెండు మూవీలు వచ్చాయి. గేమ్ ఛేంజర్ ప్లాప్ అవగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రెండు సినిమాలను ఒకేటైమ్ లో రిలీజ్ చేసి రెండింటి నుంచి డిఫరెంట్ ఫలితాలను చూశాడు. గేమ్ ఛేంజర్ భారీ అంచనాలతో వచ్చి నష్టాలను మిగల్చడంపై దిల్ రాజు స్పందంచారు.
read also : Shriya Sharma : సమంత చెల్లెలు.. ఇప్పుడు టాప్ లాయర్..
ఆయన మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్ డ్యామేజ్ నాకు ముందే అర్థమైపోయింది. రిలీజ్ కు ముందే సినిమా రిజల్ట్ పై అనుమానాలు పెరిగాయి. అదే టైమ్ లో వెంకటేశ్ తో తీసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ మ్యాజిక్ చేస్తుందని అర్థమైపోయింది. అందుకే ఆ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్నాను. వెళ్లి చిరంజీవి, రామ్ చరణ్ ను అడిగితే వాళ్లు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. అందుకే రెండు సినిమాలను ఒకే టైమ్ లో రిలీజ్ చేశాను. గేమ్ ఛేంజర్ తో దాదాపు రూ.100 కోట్ల దాకా నష్టాలు వచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వచ్చిన లాభాలను గేమ్ ఛేంజర్ తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకే పంచాను. నేను తీసుకోలేదు. ఆ మూవీ వల్లే డిస్ట్రిబ్యూటర్లు, ఇండస్ట్రీ సేవ్ అయింది. అంతటి నష్టాలను పూడ్చడం అంటే చాలా కష్టం. కానీ రామ్ చరణ్ ఒప్పుకోవడం వల్లే సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. లేదంటే చాలా నష్టాలు చూసేవాడిని అంటూ తెలిపాడు దిల్ రాజు.
read also : Vishwambhara : విశ్వంభరపై అనుమానాలు.. చిరు తేల్చాల్సిందే..
