Site icon NTV Telugu

New Offer: ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశీ!

Digangana Suryavanshi

Digangana Suryavanshi

ప్రముఖ నిర్మాత కె. కె. రాధామోహన్ ప్రస్తుతం టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో 10వ‌ చిత్ర‌మిది. దీనితో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన కథానాయికగా నటించడానికి నటి దిగంగనా సూర్యవంశీని ఖ‌రారు చేశారు.

తెలుగు, హిందీ భాషలలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో న‌టిస్తున్న దిగంగన ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాలో న‌టించ‌డం ప‌ట్ల చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతోంది. ‘హిప్పీ’ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిగంగనా గత యేడాది విడుదలైన ‘సీటీమార్’లో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంలో ప్రతిభావంతులైన సాంకేతిక బృందం ప‌నిచేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల కెమెరా బాధ్యతలు చేప‌ట్టారు. ఈ చిత్రానికి గిడుతూరి సత్య ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్‌ సమర్పిస్తున్నారు.

Exit mobile version