Naresh: మరో సీనియర్ హీరోయిన్ మోజులో నరేష్.. పవిత్రతో తెగదెంపులు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఇటీవల నటి పవిత్రతహా అతడి నాలుగో పెళ్లి వార్త ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవిత్రా లోకేష్ తో నరేష్ కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నాడని, వారిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు ఈ జంట ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లడం, ఒకరి గురించి ఒకరు మాట్లాడుతుండడంతో అందరూ నిజమే అనుకున్నారు. అంతా సవ్యంగా జరుగుతున్నా నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడంతో ఈ వివాదం ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. తన భార్య పెద్ద సైకో అని, డబ్బు కోసం ఏదైనా చేస్తుందని నరేష్ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. నాకు విడాకులు ఇవ్వకుండా పవిత్రను ఎలా పెళ్లాడతాడని రమ్య మీడియా ముందు హల్చల్ చేసింది.
ఇక పవిత్రా లోకేష్.. నరేష్ నా ప్రాణం.. ఆయనకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటానని చెప్పకొచ్చింది. ఇక ఈ ముగ్గురు ఈ వివాదాన్ని ఇంకా ఇంకా మీడియాకు లాగి రచ్చ చేశారు. ఈ వివాదం తరువాత పవిత్ర- నరేష్ లు ఎక్కడ కనిపించినా అభిమానులు, నెటిజన్లు లవ్ బర్డ్స్ అని అరవడం మొదలుపెట్టారు. అయితే అంత పాపులారిటీ తెచ్చుకున్న ఈ జంట విడిపోయారని టాక్ నడుస్తోంది. నరేష్ గత కొన్ని నెలల నుంచి వేరొక సీనియర్ హీరోయిన్ మోజులో పడి పవిత్రను వదిలేసాడని టాక్ నడుస్తోంది. అందుకే ఈ మధ్యకాలంలో ఈ జంట ఎక్కడా కనిపించడం లేదట.. అంతే కాకుండా ఈ వివాదం తరువాత పవిత్ర క్రేజ్ పెరిగి వరుస అవకాశాలు వాస్తు ఉండడం, ఆమె బిజీగా మారడంతో కూడా వీరి మధ్య విబేధాలు నెలకొన్నాయట. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కలిసి ఉన్నా.. విడిపోయినా ఎవరు ఏం చేసే పనిలేదు.. వదిలేయండి అని కొందరు అంటుండగా.. పవిత్రా ఎలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ చేసింది.. ఇప్పుడు ఈ వివాదంతో ఆమెను చూసిన వెంటనే ఏదోలా అనిపిస్తుంది అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!