Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Difference Between Sai Pallavi And Nayantara

Sai Pallavi-Nayanthara: సాయి పల్లవి, నయనతార మధ్య తేడా అదే..

Published Date :June 19, 2022 , 4:59 pm
By Subbarao N
Sai Pallavi-Nayanthara: సాయి పల్లవి, నయనతార మధ్య తేడా అదే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినిమా కమిట్ అయి చేశామంటే అది రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడియన్స్ వద్దకు చేర్చే బాధ్యత తారలదే. ఈ విషయం ఎవరైనా ఒప్పుకుంటారు. అయితే దక్షిణాది సూపర్ స్టార్ అనే ట్యాగ్ వేసుకున్న నయనతార మాత్రం ఇందుకు మినహాయింపు. తనకు స్టార్ డమ్ వచ్చిన తర్వాత సొంత సినిమాలు తప్ప మిగతా సినిమాల ప్రచారంలో అమ్మడు పాల్గొన్నది తక్కువే. అదే సాయిపల్లవిని తీసుకుంటే ఎప్పుడో కమిట్ అయి రిలీజ్ కాక ఆగిన సినిమా రీలీజ్ అవుతుంటే ముందుండి ప్రమోట్ చేసి ఎక్కడికంటే అక్కడికి వచ్చి దర్శకనిర్మాతలకు సహకరించిన తీరు మర్చిపోలేము. ఆ సినిమానే ఇటీవల విడుదలైన ‘విరాట పర్వం’. రెండేళ్ళ క్రితం పూర్తయిన సినిమా ఎందుకు ప్రచారం చేయాలని భావించక తను నచ్చి చేసిన పాత్రను జనాల్లోకి తీసుకువెళ్ళడంలో కీలక పాత్ర పోషించింది సాయిపల్లవి. ముక్కుపిండి పారితోషికం వసూలు చేసే నైజం నయనతారది అయితే నిర్మాత కష్టాల్లో ఉంటే ఇవ్వవలసిన పారితోషికాన్ని వద్దని చెప్పగలిగే మంచి మనస్తత్వ ఉన్న హీరోయిన్ సాయిపల్లవి.

ఇక ఇటీవల జరిగిన రెండు మేజర్ సంఘటలను కూడా వీరి క్యారక్టర్స్ కి అద్దం పట్టేవిగా ఉన్నాయి. ఇద్దరు ముగ్గురుతో ప్రేమాయణం నడిపి చివరకు దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లాడిన నయన్ పెళ్ళి తర్వాత తిరుమలకు వేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చింది. దేవుని దర్శనం ముగిసిన తర్వాత మాడవీధుల్లో ఫోటో షూట్ చేస్తూ చెప్పులు ధరించి అపవిత్రం చేసింది. ఇది మీడియాలో హైలైట్ అయి విమర్శలు వెల్లువెత్తడంతో విఘ్నేష్‌ శివన్ సారీ చెప్పి తెలియక జరిగిన పొరపాటని సర్ధి చెప్పాడే కానీ నయనతార స్పందించనే లేదు.

అదే ‘విరాటపర్వం’ ప్రచారంలో భాగంగా ఓ యు ట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ  ఇస్తూ ‘కాశ్మీర్ ఫైల్స్’, పాకిస్థాన్ విషయాలపై కామెంట్స్ చేసింది. అయితే అవి వివాదాస్పదం అయ్యాయి. ఇదే విషయమై ప్రెస్ మీట్స్ తో తనని ప్రశ్నించినపుడు తను సినిమా ప్రచారంలో ఉన్నానని తన వ్యాఖ్యలపై తప్పక స్పందిస్తానని తెలియచేసింది. అప్పుడు అందరూ దాటవేయటానికి అలా చెప్పిందని భావించారు. కానీ సాయి పల్లవి అలా భావించలేదు. తనా వ్యాఖ్యలను ఏ సందర్భంలో చేసిందో సవివరంగా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియచేసింది. ఈ రెండు సందర్భాలను తరచి చూసుకుంటే నిజానికి నయనతార తనంతట తాను మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పవలసిన అంశం. అయినా చీమకుట్టినట్లు గా కూడా తీసుకోలేదు. సాయిపల్లవి మాత్రం తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వటం బాధ్యతగా భావించి స్పందించింది. ఇదే నయనతారకు సాయిపల్లవికి మధ్య ఉన్న తేడా. సో స్టార్ డమ్ తో పాటే ప్రేక్షకుల్లో బాధ్యతగల పౌరులు అనిపించుకోవడం కూడా ఎంతో ముఖ్యం. నయనతారకు లేనిది సాయిపల్లవికి ఉన్నది అదే… బాధ్యత. కాదంటారా!?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • difference between actress
  • Nayanthara
  • Sai Pallavi
  • The Kashmir Files controversy
  • tirupai controvercy

తాజావార్తలు

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

  • Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?

  • Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..

  • Viral News: ‘పోలీస్ మామల స్క్వాడ్’.. మందుబాబుల వాట్సాప్ గ్రూప్‌లో షాకిచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ

  • Botsa Satyanarayana: అమరావతిపై తీర్మానం చేసినంత మాత్రాన పర్మినెంట్‌ కాదు.. బొత్స సంచలనం

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions