Site icon NTV Telugu

Honey Rose: ఈ హీరోయిన్ ఆల్రెడీ ఒక తెలుగు సినిమాలో నటించిందని మీకు తెలుసా?

Honey Rose

Honey Rose

నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ నుంచి ఇటివలే రిలీజ్ అయిన సాంగ్ ‘మా బావ మనోభావాలు’. ఇన్స్టాంట్ హిట్ అయిన ఈ పాటలో బాలయ్య పక్కన ‘చంద్రిక రవి’ ఐటెం గర్ల్ గా హాట్ డాన్స్ చేసింది. టాప్ ట్రెండింగ్ లో ఉన్న ‘మా బావ మనోభావాలు’ సాంగ్ లో చంద్రిక రవి కన్నా ఆడియన్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసిన బ్యూటీ ‘హనీ రోజ్’. బ్లాక్ సారీలో కనిపించిన హనీ రోజ్, మాస్ డాన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. బాలయ్య, హానీ రోజ్ ల పెయిర్ బాగుండడంతో సినీ అభిమానులంతా ఈ హీరోయిన్ ఎవరు? ఎక్కడి నుంచి తెచ్చారు అంటూ ఆరా తీస్తున్నారు.

Read Also: Adivi Sesh: ఆమెతో అడివి శేష్ ఎఫైర్.. మరోసారి బట్టబయలు..?

‘మా బావ మనోభావాలు’ సాంగ్ లో కనిపించిన హనీ రోజ్ వర్గీస్ కేరళ అమ్మాయి. 14వ ఏటనే హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హానీ రోజ్ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మమ్ముట్టీ, మోహన్ లాల్, సురేష్ గోపి, ఫాహాద్ ఫజిల్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. మోహన్ లాల్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హానీ రోజ్ కి, తెలుగులో ‘వీర సింహా రెడ్డి’ సినిమానే ఫస్ట్ మూవీ కాదు. 2008లోనే ‘ఆలయం’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్, ఆ తర్వాత అయిదేళ్ళకి మళ్లీ ‘ఈ వర్షం సాక్షిగా’ అనే సినిమాలో నటించింది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ మూవీ తర్వాత హానీ రోజ్ తెలుగులో సినిమాలు చెయ్యలేదు. దాదాపు పదేళ్ల తర్వాత హనీ రోజ్ నటిస్తున్న తెలుగు సినిమా ‘వీర సింహా రెడ్డి’నే, ఈ సినిమాతో అయినా హనీ రోజ్ టాలీవుడ్ లో సెటిల్ అవుతుందేమో చూడాలి.

Read Also: Rashmika Mandanna: సౌత్ పాటల్లో మాస్ మాత్రమే ఉంటుంది…

Exit mobile version