కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలివుడ్ వర్గాలు. ఇప్పటివరకు విజయ్ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడిన..అలాంటి ఉద్దేశ్యం లేదని, ప్రస్తుతం సినిమాలపైనే తన దృష్టి అంతా అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ ‘ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం’ పేరుతో ఒక పార్టీ పేరును రిజిస్టర్ చేయించినా .. దాని బలవంతంగా ఉపసంహరించుకునేలా చేశాడు విజయ్.. దీంతో విజయ్ కి రాజకీయాలపై ఆసక్తిలేదని ఆయన అభిమానులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల విజయ్.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అవ్వడం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల హైదరాబాద్ లో విజయ్, ప్రశాంత్ కిషోర్ కలిసి రాజకీయ మంతనాలు చేసినట్లు ఆలస్యంగా వెలుగు చూసిందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇది నిజమేనని విజయ్ సన్నిహితులు కూడా తెలపడంతో దళపతి పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అని తమిళ్ తంబీలు ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలన అన్నాడీఎంకే నాయకత్వ లోపంతో సతమతం అవుతోంది.. దీంతో తమ భవిష్యత్తు ఏంటి అని అన్నాడీఎంకేపార్టీ సభ్యులు భయాందోళనలో ఉంది. ఇలాంటి సమయంలో విజయ్ పార్టీ పెడితే అందరు విజయ్ పార్టీలోకి చేరే అవకాశం లేకపోలేదని అంటున్నారు పలువురు రాజకీయ పెద్దలు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉంది.. అసలు విజయ్.. ప్రశాంత్ కిషోర్ ని ఎందుకు కలిశారు.. త్వరలోనే విజయ్ పార్టీ ప్రకటన రానుందా..? అనేది తెలియాల్సి ఉంది.
