NTV Telugu Site icon

Pathaan: బాలీవుడ్ పతనాన్ని ‘పఠాన్’ ఆపినట్టేనా..?

Sharukh

Sharukh

Pathaan: గతేడాది బాలీవుడ్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలు, బడ్జెట్ సినిమాలు ఇవేమి బాలీవుడ్ ను కాపాడలేకపోయాయి. సౌత్ లో హిట్ సినిమాలు.. నార్త్ లో ప్లాప్ సినిమాలు. ఒక్కరంటే ఒక్కరు కూడా బాలీవుడ్ ను కాపాడలేకపోయారు. ఇక దీంతో బాలీవుడ్ పతనం ప్రారంభమైయిందని ట్రోల్స్ వచ్చాయి. ఒక్కరు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీని నిలబెట్టడానికి రారు అని ట్రోలర్స్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గామారింది. ఇక గతేడాది లానే ఈ ఏడాది కూడా అలాగే ఉంటుంది అనుకున్నారు. అదే సమయంలో వచ్చాడు పఠాన్. బాలీవుడ్ చరిత్రను తిరగరాయడానికి.. దేవుడా ఒక్క సినిమా యావరేజ్ టాక్ ను అందుకున్నా పర్లేదు అనుకునే సమయంలో మంచి విజయాన్ని అందుకున్నాడు పఠాన్.

షారుఖ్ ఖాన్, దీపికా జంటగా నటించిన ఈ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. నేడు రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకులు సైతం షారుఖ్ నటనకు ఫిదా అయ్యారు. రా ఏజెంట్ గా షారుఖ్ నట విశ్వరూపం.. దీపికా దాచుకోలేని అందాలు.. ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసాయి. సూపర్.. బంపర్ అని చెప్పలేం కానీ సినిమా బావుంది అని తెలుగు ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఈ డీసెంట్ టాక్ చాలు ముందు ముందు పఠాన్ కలక్షన్స్ సునామీ సృష్టించడానికి.. ఇక షారుఖ్ ఈ ఒక్క హిట్ తో బాలీవుడ్ పతనాన్ని ఆపినట్టేనా అంటే నిజమే అంటున్నారు అభిమానులు. బాలీవుడ్ బాద్షా అని షారుఖ్ మరోసారి నిరూపించుకున్నాడు. మరి షారుఖ్ నిలబెట్టిన పేరును ఆ తర్వాత హీరోలు నిలబెడతారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Show comments