NTR: సాధారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కోపం రావడం చాలాతక్కువ సార్లు చూసి ఉంటాం. మొదటి నుంచి కూడా తారక్ కు చాలా కోపం ఎక్కువ అంట. పెళ్లి తరువాత.. పిల్లలు పుట్టాకా ఆ కోపం తగ్గిందని ఆయనే స్వయంగా ఓకే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సహజంగా తానెప్పుడు బయట కోపం తెచ్చుకొను అని చెప్తూ ఉంటాడు. ఫ్యాన్స్ ఎంత గోల చేసినా.. ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. చివరికి తాత పేరును యూనివర్సిటీకి తీసివేసినా ఎన్టీఆర్ ఏరోజు కోపం తెచ్చుకోలేదు. కనీసం సీరియస్ గా ఒక్క మాట అన్నది కూడా లేదు. అయితే.. మొట్టమొదటిసారి నిన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కోపాన్ని చూశాం అంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మే 28.. ఎన్టీఆర్ శతజయంతి జరుగుతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్.. తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించడానికి విచ్చేశాడు. ఈ ఒక్కసారే అని కాదు ప్రతి ఏడాది.. అదే రోజున అభిమానులు తారక్ ను చూడడానికి తండోపతండాలుగా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుంటారు.
Allu Sirish: బన్నీ బ్రదర్.. మరో రీమేక్.. ?
ఇక ఈ నేపథ్యంలోనే తారక్ డైరెక్ట్ గా వెళ్లి నివాళులు అర్పించడానికి రాగా.. పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆయనకు బొకే ఇవ్వడానికి ప్రయత్నించాడు. దాన్ని తారక్ నెట్టేసి పక్కనే ప్లేట్ లో ఉన్న గులాబీ పూలతో తాతకు నివాళులు అర్పించి వెళ్ళిపోయాడు. ఇక అది జరిగింది. దీంతో ఆ బొకేను పక్కకు నెట్టడంతో తారక్ కు కోపమొచ్చిందా..? ఎందుకు ఆయన బొకేను తీసుకోలేదు.. ఎందుకు విసిరికొట్టాడు..? అంటూ సోషల్ మీడియాలో చర్చా గోష్ఠి మొదలయ్యింది. ఇక దీన్ని కొందరు రాజకీయం చేస్తుండగా.. మరికొందరు తారక్ ను ట్రోల్ చేసేవారందరిని ఇలా విసిరికొట్టడమే అని మీమ్స్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది..? అంటే.. అంతమంది జనం మధ్య వచ్చిన తారక్ కు.. అక్కడ ఇద్దరు వ్యక్తులు రెండు చేతుల్లో బొకేలు పట్టుకొని ఆయనకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. నాది తీసుకోండి.. నాది తీసుకోండి అన్నట్లు ఒకరిమీదఒకరు పడి తోసుకుంటూ రావడానికి ట్రై చేస్తుంటే.. తారక్.. ఇద్దరిది తీసుకోకుండా అక్కడే ఉన్న పూలతో నివాళులు అర్పించి వెళ్ళిపోయాడు. అది కోపం కాదు.. కేవలం.. అభిమానులను ఇబ్బంది పెట్టకుండా.. నొచ్చుకోకుండా చేయడం కోసం మాత్రమే అని అక్కడ ఉన్నవారు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ కి కోపం వచ్చిందా..! #NTR #FANS #NtvENT pic.twitter.com/paGTckmSJ1
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) May 28, 2023