Site icon NTV Telugu

Bollywood : ధురంధర్ సక్సెస్.. బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ నుండి వైదొలిగిన రణవీర్, అక్షయ్ కన్నా

Bollywood

Bollywood

బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆదిత్యధర్‌ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. రిలీజై నేటికి 20రోజులైనా కలెక్షన్ల వర్షం కొనసాగుతూనే ఉంది. సినిమా భారీ సక్సెస్‌తో ఇటు మేకర్స్‌.. అటు ఇందులో నటించిన నటీనటులు క్లౌడ్‌9లో విహరిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ ఎనర్జీ, అక్షయ్ ఖన్నా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. అయితే ఈ విజయం తర్వాత తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఈ ఇద్దరు స్టార్స్‌ లెక్కలు మార్చుకున్నారు. రీమేక్స్‌, సీక్వెల్‌ చిత్రాల కంటే, ధురంధర్ లాంటి ఒరిజినల్ కంటెంట్‌తోనే తమ మార్కెట్‌ను ఎక్స్‌పాండ్‌ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

Also Read : TheRajaSaab : రేపే రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. కానీ వెన్యూ మారింది..

ధురంధర్‌ ట్రమెండస్‌ సక్సెస్‌తో రణ్‌వీర్ తన రూట్ మార్చాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్‌తో రణ్‌వీర్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచడంతో పాటు, కథలో తన పాత్రకు మరింత ప్రయారిటీ ఉండాలని కోరాడట. ‘డాన్’ బ్రాండ్‌లో ఇమడడం కంటే, తన సొంత ఇమేజ్‌తో ‘శక్తిమాన్’ లేదా ‘ధురంధర్’ సీక్వెల్స్ మీద ఫోకస్ చేయడం ఉత్తమమని రణ్‌వీర్‌ సింగ్‌ భావిస్తున్నాడు. అందుకే డాన్‌ 3 మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. రణ్‌వీర్‌ బాటలోనే నటుడు అక్షయ్ ఖన్నా సైతం దృశ్యం 3 ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నాడు. ధురంధర్ సక్సెస్‌ ఈ ఇద్దరి స్టార్స్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. మరోవైపు అక్షయ్ ఖన్నా నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. దృశ్యం 2లో ఆయన పోషించిన ఐజీ బాస్టన్ రాజ్ పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే దృశ్యం 3లో అజయ్ దేవగన్‌తో తలపడేందుకు సిద్ధమవ్వాల్సిన అక్షయ్, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ధురంధర్ సక్సెస్ తర్వాత ఆయనకు సోలో హీరోగా లేదా పారలల్ లీడ్ రోల్స్‌ భారీగా వస్తున్నాయి. కేవలం ఒక ఫ్రాంచైజీకి పరిమితం అవ్వడం ఇష్టం లేకనే ఆయన దృశ్యం 3 నుంచి తప్పుకున్నట్టు బాలీవుడ్‌ టాక్‌.

Exit mobile version