రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ రివెంజ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ సినిమా మీద అనూహ్యంగా ఒక కాపీ ఆరోపణ వచ్చింది. సినిమా కథ తనదంటూ సంతోష్ కుమార్ ఆర్.ఎస్. అనే ఒక దర్శకుడు ఇటీవల మీడియా ముందుకు వచ్చి తీవ్ర విమర్శలు చేశారు. స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌లో తాను 2023 సమయంలో రిజిస్టర్ చేసుకున్న స్క్రిప్ట్‌ని ఆదిత్య ధర్ కాపీ కొట్టాడని, తన దగ్గర స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!
తన ప్రాజెక్ట్‌ను మేనిపులేట్ చేసి, తనను మానసికగా, వృత్తిపరంగా వాడుకున్నారని సంతోష్ ఆరోపించారు. అయితే, సంతోష్ చేస్తున్న ఆరోపణలను ఆదిత్య ధర్ ఖండించారు. తన లీగల్ టీమ్ ద్వారా సంతోష్‌కి లీగల్ నోటీసులు కూడా పంపినట్లు తెలుస్తోంది. సంతోష్ చేస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలని, సినిమా కథకు ఆయన చెప్పిన కథకు ఎలాంటి సంబంధం లేదని నోటీసులో పేర్కొన్నారు. సినిమా ప్రతిష్టను దెబ్బతీయవద్దని, తక్షణమే ఇలాంటి కామెంట్స్ చేయడం ఆపాలని హెచ్చరించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ సంతోష్ కుమార్ వెనక్కి తగ్గకపోవడంతో, ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఆదిత్య ధర్ సిద్ధమవుతున్నారు.