Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“తుఫానులా దూసుకువచ్చే వాడినే ‘ధురంధర్’ అంటారు”.. ఈ ఒక్క డైలాగ్ చాలు రాబోయే యాక్షన్ సునామీ ఏ రేంజ్లో ఉండబోతుందో ఊహించుకోవడానికి! ఎవరూ ఊహించని సరికొత్త అవతారంలో, మునుపెన్నడూ చూడని పచ్చి నెత్తురు లాంటి ‘రా అండ్ రస్టిక్’ యాక్షన్ ఎంటర్టైనర్గా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు క్రేజీ మూవీ ‘ధురంధర్: ద రివెంజ్’ సిద్ధమైంది. సినిమా రిలీజ్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు డిజిటల్ వేదికగా ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించడానికి సిద్ధమైంది.
సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు పెద్ద స్టార్స్ కనిపిస్తేనే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అలాంటిది బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్, యాక్షన్ కింగ్ సంజయ్ దత్, మ్యాచో మ్యాన్ అర్జున్ రాంపాల్, వర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్, అలాగే టాలెంటెడ్ నటుడు అక్షయ్ ఖన్నా లాంటి హేమాహేమీలు ఈ సినిమాలో ఒకేసారి కనిపించనున్నారు. వీరికి తోడుగా యువ నటి సారా అర్జున్ కూడా ఒక కీలక పాత్రలో మెరవనుంది. పవర్ఫుల్ పర్ఫార్మర్లందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుండటంతో పాటు వేల కోట్ల కలెక్షన్లు ఈ రివెంజ్ డ్రామాపై అంచనాలు పెంచాయి. దర్శకుడు ఆదిత్య ధర్ సృష్టించిన ఈ యాక్షన్ ప్రపంచాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్, టీ-సిరీస్ సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఫీస్ట్‌ను ముస్తాబు చేశారు. మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ‘ధురంధర్: ద రివెంజ్’ గ్రాండ్ డిజిటల్ ప్రీమియర్ జూన్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు అట్టహాసంగా జరగనుంది. ఆ తర్వాతి రోజు అనగా, జూన్ 5వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘జియో హాట్‌స్టార్’లో ఈ చిత్రం ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. స్టార్ గోల్డ్ ఇండియా భాగస్వామ్యంతో వస్తున్న ఈ సినిమా.. ఓటీటీ వేదికగా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్‌శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్‌న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!