Site icon NTV Telugu

Dhurandhar 2: తెలుగు వెర్షన్ కోసం ఎదురు చూసేవారికి గుడ్ న్యూస్

Dhurandhar 2 (2)

Dhurandhar 2 (2)

గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్న **’ధురంధర్ 2′ Dhurandhar: The Revenge ఎట్టకేలకు థియేటర్లలో గర్జించడానికి సిద్ధమైంది. సాంకేతిక కారణాలు, సెన్సార్ చిక్కుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ప్రాంతీయ భాషల వెర్షన్లు రేపటి నుంచి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ సినిమాకు సంబంధించి భారీ ఎత్తున స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. అయితే, చివరి నిమిషంలో కొన్ని అనూహ్యమైన టెక్నికల్ ఇష్యూస్ మరియు సెన్సార్ సమస్యల వల్ల ఈ షోలు రద్దయ్యాయి. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురైనప్పటికీ, ఇప్పుడు ఆ సమస్యలన్నీ తొలగిపోయాయి. రేపటి (శనివారం) నుంచి అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ‘ధురంధర్ 2’ అధికారికంగా ప్రదర్శించబడనుంది.

Also Read:TheRajaSaab Premieres: రాజాసాబ్ గందరగోళం బయటపెట్టిన మైత్రీ శశి

ప్రాంతీయ వెర్షన్లు అందుబాటులో లేకపోయినా, థియేటర్లలో బజ్ తగ్గకుండా ఉండేందుకు మేకర్స్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు, తమిళ రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో హిందీ వెర్షన్ ప్రదర్శించారు. భాష తెలియకపోయినా, కేవలం సినిమాపై ఉన్న క్రేజ్‌తో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు.హిందీ వెర్షన్‌కు సౌత్ ఆడియన్స్ నుంచి లభించిన ఈ అద్భుతమైన రెస్పాన్స్ చూసి అటు థియేటర్ యజమానులు, ఇటు చిత్ర యూనిట్ షాక్ తిన్నారు. ఇది సినిమా రేంజ్‌ను మరోసారి చాటిచెప్పింది. ఒకవైపు సంజయ్ దత్ ఇంట్రడక్షన్ సాంగ్ ‘హవా హవా’ రీమిక్స్ హంగామా, మరోవైపు రివెంజ్ డ్రామాతో కూడిన పవర్‌ఫుల్ స్టోరీ కావడంతో ‘ధురంధర్ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రేపటి నుంచి సొంత భాషల్లో సినిమా చూసే అవకాశం ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version