Dhurandhar 2: క్లైమాక్స్ సీన్లు లీక్ చేస్తే ఊరుకోం: నటుడు వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ప్రభంజనం సృష్టిస్తోంది, రికార్డులను తిరగరాస్తూ కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు రాకేశ్ బేడీ ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన విన్నపం చేశారు, “సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో స్పియిలర్లు షేర్ చేయవద్ద”ని ఆయన కోరారు. గతంలో ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రంలో జమీల్ జమాలీ పాత్రతో మెప్పించిన రాకేశ్ బేడీ, సీక్వెల్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో విడుదల చేస్తూ.. “ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను ముక్కలు చేసింది, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇది కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, సామాన్య ప్రజలపై కూడా గట్టి ప్రభావం చూపుతోంది” అని అన్నారు.
Also Read:Tollywood Events: అంత జరిగినా అదే నిర్లక్ష్యమా ?
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
అయితే, థియేటర్లలో సినిమా చూస్తున్న సమయంలో ఫోన్లతో సీన్లు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టవద్దని ఆయన నెటిజన్లను కోరారు, ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ లేదా చివరి సన్నివేశాలను లీక్ చేయడం ‘స్పాయిల్ స్పోర్ట్’ అవుతుందని, మీరు సినిమా చూసి ఎంజాయ్ చేశారు కదా, అలాగే మిగిలిన వారు కూడా ఆ అనుభూతిని పొందేలా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాకేశ్ బేడీ కంటే ముందే దర్శకుడు ఆదిత్య ధర్ కూడా ప్రేక్షకులను ఇదే విషయంపై కోరారు. “ప్రతి అభిమాని ఏమీ తెలియకుండానే థియేటర్లోకి అడుగుపెట్టాలి, సినిమా చూశాక ఒక వ్యక్తిగత అనుభూతితో బయటకు రావాలి. అందుకే దయచేసి కథలోని మలుపులను బయట పెట్టకండి” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!