NTV Telugu Site icon

Jawan: వందమంది అమ్మాయిలతో షారుఖ్ .. దుమ్ము దులిపేశాడు అంతే

Sharukh

Sharukh

Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ప్రివ్యూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటినుంచి కూడా జవాన్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక అభిమానుల అంచనాలకు తగ్గకుండా అట్లీ.. జవాన్ ప్రమోషన్స్ ను చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మ్యూజిక్ వీడియోస్ ను రిలీజ్ చేసి సినిమాపై మరింత హైప్ ను పెంచేస్తున్నారు. తాజాగా జవాన్ నుంచి మొదటి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దుమ్మే దులిపేలా అంటూ సాగిన వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Anshu Ambani: అయ్యా.. ప్రభాస్ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..?

షారుఖ్ అల్ట్రా స్టైలిష్ లుక్, హుక్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఐపీఎస్ గా షారుఖ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీడియోలో ప్రియమణి, సాన్యా మల్హోత్రా.. షారుఖ్ తో కలిసి చిందులు వేశారు. దాదాపు వందమంది లేడీ డ్యాన్సర్లు ఇందులో కనిపించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ అందించిన లిరిక్స్ కు అనిరుధ్ వోకల్స్ తో పాటు అదిరిపోయే మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఒక మనిషి ఎలా ఉండాలి అనేది లిరిక్స్ లో చంద్రబోస్ ఎంతో అద్భుతంగా రాశారు. ఇక శోభి పాల్ రాజ్ కొరియోగ్రఫీ అయితే హైలైట్ అని చెప్పాలి. షారుఖ్ ఎనర్జిటిక్ స్టెప్స్ తో అదరగొట్టేశాడు. ఇప్పటికే ప్రివ్యూతోనే హైప్ పెంచేసిన అట్లీ.. ఈ సాంగ్ తో మరింత హైప్ తెచ్చేశాడు. మరి ఈ సినిమాతో బాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

Show comments