ప్రజెంట్ ట్రెండ్ లో ఉన్న వార్త రీతూ చౌదరి.. ధర్మ మహేశ్ ఏఫైర్. హీరో ధర్మ మహేశ్ .. తనని వదిలి రీతూతో సన్నిహితంగా ప్రవర్తిస్తున్నాడని, ఎన్నోసార్లు ఆమెను అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలు షేర్ చేసింది అతడి భార్య గౌతమి . అలాగే వరకట్నం కోసం వేధించేవాడని, తను గర్భంతో ఉండగా మహేశ్ తనను తోసేశారని, నరకం చూపించాడాని.. పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో
Also Read : Kalyani Priyadarshan : నేను ఏ అనాధాశ్రమంలోను గడపలేదు.. తప్పుడు ప్రచారాలు ఆపండి
తాజాగా ధర్మ మహేశ్ దీనిపై స్పందించారు “నాకు, రీతూకు మధ్య ఏమీ లేదు. మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. మా బెడ్‌రూమ్ ఫుటేజీల గురించి ఆమె చెప్పడం పూర్తిగా అబద్ధం. కావాలంటే ఆ ఫుటేజీలు రిలీజ్ చేయండి. నా కొడుకు ఈ గొడవలో ఎందుకు లాగబడుతున్నాడో నాకు అర్థం కాదు. నేను డిప్రెషన్‌లో ఉన్నాను, సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకును ఎందుకు లాగుతున్నారు? ఏడేళ్లు కష్టపడి వచ్చిన తర్వాత నా పేరు నాశనం చేయడానికి ఆమె అబద్ధాలు చెప్పింది. నా ఇంటిలో ఉండే వ్యక్తికి నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పింది, కానీ అది అసత్యం. నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా.. కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదు. సరే.. ఆమె విడాకులు కావాలంటోంది కదా.. ప్రశాంతంగా విడిపోదామంటున్నాను. నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేశ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ వ్యాఖ్యల ద్వారా ధర్మ మహేశ్ రీతూ చౌదరి ఆరోపణలపై నిజానిజాలను బయటపెట్టారు.