Dhanya Balakrishna : తెలుగు బ్యూటీ ధన్య బాలకృష్ణన్ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటుంది. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమె నుంచి కృష్ణలీల అనే సినిమా వస్తోంది. దేవన్ హీరోగా స్వీయ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ధన్య హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో ధన్య మాట్లాడుతూ.. ఈ సినిమా నా కెరీర్ కు మళ్లీ టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నా. నేను సినిమాల్లో చాలా కండీషన్లు పెట్టుకున్నాను. అందుకే పెద్ద స్థాయికి ఎదగలేకపోయాను. ఇంటిమేట్ సీన్లు చేయొద్దని, రొమాంటిక్ సీన్లు చేయొద్దని ఇలా చాలా కండీషన్లు పెట్టుకున్నాను. అలా ఎన్నో సినిమా ఛాన్సులు వదులుకున్నా.
Read Also : Ramyakrishna : ఐరన్ లెగ్ అన్నారు.. రమ్యకృష్ణ ఎమోషనల్
ఒకవేళ అన్ని సీన్లు చేసి ఉంటే ఈ పాటికి మంచి పొజీషన్ లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడున్న పొజీషన్ కు నేను చాలా సంతోషిస్తా. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను.. ఈ స్థాయి దాకా ఎదుగుతానని అనుకోలేదు. అదే నాకు గొప్ప ఫీలింగ్ ఇస్తుంది. పెద్ద సినిమాలు చేయడం కన్నా కూడా మంచి సినిమాలు చేయడమే నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది ధన్య. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ తెలుగులో కొన్ని బోల్డ్ సినిమాల్లో కూడా నటించింది. వాటి వల్ల ఆమెకు కొంత నెగెటివిటీ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి క్రేజ్ సంపాదించుకుంటుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
