కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం “మారన్” నేరుగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారం పాపులర్ ఓటిటి ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అయితే ఇప్పుడు “మారన్” విడుదలకు చిన్న అంతరాయం ఏర్పడింది. సినిమా విడుదల టైమింగ్ మారినట్టు తెలియజేస్తూ డిస్నీ కొత్త అప్డేట్ను వెల్లడించింది.
Read Also : ET Review : ఎవరికీ తలవంచడు (తమిళ డబ్బింగ్)
సాధారణంగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లు 12 AMకి సినిమా స్ట్రీమింగ్ ను అందుబాటులో ఉంచుతాయి. కానీ ‘మారన్’ విషయంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆ టైంను మార్చింది. రేపు సాయంత్రం 5 గంటల నుండి మారన్ ప్రసారానికి అందుబాటులో ఉంటుందని హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది. కార్తీక్ నరేన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ధనుష్ అంతకుముందు చేసిన ‘కర్ణన్’, ‘జగమే తందిరం’ వంటి చిత్రాలు కూడా ఓటిటిలోనే విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ విడుదల కోసం ధనుష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.