మోస్ట్ టాలెంటెడ్ ఇండియన్ హీరోస్ అనే లిస్టు తీస్తే అందులో ధనుష్ పేరు టాప్ 5లో ఉంటుంది. రెండు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్, తెలుగు-తమిళ భాషల్లో చేసిన మొదటి బైలింగ్వల్ మూవీ ‘సార్/వాతి’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన సార్ సినిమాకి జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్, సార్ సినిమాపై అంచనాలని మరింత పెంచింది. మిగిలిన తమిళ స్టార్ హీరోల్లా కాకుండా ధనుష్ స్వయంగా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి వచ్చి సార్ సినిమాని ప్రమోట్ చెయ్యడం ఈ మూవీకి మరింత కలిసొచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ తో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసిన ‘సార్’ మూవీ తెలుగులో ధనుష్ ని సాలిడ్ డెబ్యు ఇచ్చింది.
Read Also: Dhanush: నా భార్య నన్ను ఎప్పుడు మెచ్చుకోలేదు..
మార్నింగ్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో సార్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. తమిళ్ కన్నా తెలుగులోనే కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ధనుష్ కి ఎలాంటి డెబ్యు దొరికిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సార్ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటివరకూ సార్ సినిమా 50 కోట్లని రాబట్టింది. సండేకి సార్ సినిమా అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేసి, బయ్యర్స్ అందరికీ ప్రాఫిట్స్ ఇస్తోంది. మూడు రోజుల్లోనే మంచి వసూళ్లని రాబట్టి సార్ సినిమా మండే కూడా మంచి బుకింగ్స్ ని రాబడుతోంది. థియేటర్స్ పెరుగుతుండడంతో ధనుష్ సార్ సినిమా కలెక్షన్స్ లో ఇంకా గ్రోత్ కనిపించడం గ్యారెంటీ.
