Site icon NTV Telugu

Danush : ధనుష్‌ – కలాం బయోపిక్‌పై ఓం రౌత్ వ్యాఖ్యలు

Abdul Kalam

Abdul Kalam

భారత మాజీ రాష్ట్రపతి, ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం బయోపిక్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తున్నది బాలీవుడ్‌ ఫేమస్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌. ఆదిపురుష్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన, ఈసారి తన పూర్తి శ్రద్ధను కలాం బయోపిక్‌పై కేంద్రీకరించారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఎంతగానో పెంచేలా ఓం రౌత్‌ తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కలాం పాత్ర పోషిస్తున్న హీరో ధనుష్‌ గురించి విశేషంగా మాట్లాడారు.

Also Read : Jyothika : హీరోయిన్లకు గౌరవం లేదా..? సౌత్ ఇండస్ట్రీపై జ్యోతిక సంచలన ఆరోపణలు..

‘ధనుష్‌ ఒక అద్భుతమైన నటుడు. ఈ పాత్రకు ఆయన తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు. ప్రతి సన్నివేశంలోనూ కలాం గారే కనిపిస్తారు. ఈ పాత్రను ఆయన ఒప్పుకోవడం నా అదృష్టం.ఈ సినిమా కేవలం ఒక బయోపిక్ మాత్రమే కాకుండా, అందులో కమర్షియల్ టచ్‌ కూడా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం’ అని ఓం రౌత్‌ పేర్కొన్నారు. అంతే కాదు ఈ సినిమా కోసం ఓం రౌత్‌, కలాం గారి కుటుంబ సభ్యులను, ఆయన స్నేహితులను, ఆయనతో పనిచేసిన శాస్త్రవేత్తలను కూడా సంప్రదించారు. నిజ జీవితానికి దగ్గరగా, తప్పులు లేకుండా కథను తెరకెక్కించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. భూషణ్‌ కుమార్‌, అనిల్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌, కృష్ఖ్‌ కుమార్‌ లాంటి పెద్ద నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కాగా ప్రస్తుతం ధనుష్‌ తనకు ఉన్న ఇతర కమిట్‌మెంట్స్‌ పూర్తి చేసుకున్నాక, ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌ “కలాం : ది మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా”గా ఫిక్స్ చేశారు. ఒకే భాషకు పరిమితం కాకుండా, పాన్‌ ఇండియా లెవెల్‌లో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Exit mobile version