NTV Telugu Site icon

Dhanraj : 15 ఏళ్లకే పెళ్లి.. ఆ సినిమాతో సర్వం కోల్పోయాంః ధన్ రాజ్ భార్య

Dhanraj

Dhanraj

Dhanraj : టాలీవుడ్ లో కమెడియన్ ధన్ రాజ్ కు మంచి గుర్తింపు ఉంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేశాడు. అయితే తన కెరీర్ లో తన భార్య ఎంతో సపోర్టు చేసిందని ఎప్పుడూ చెప్తుంటాడు. తాజాగా ఆయన భార్య శిరీష తమ జీవితంలో ఎదురైన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ‘మాది లవ్ మ్యారేజ్. 15 ఏళ్లకే ధన్ రాజ్ ను పెళ్లి చేసున్నాను. ధన్ రాజ్ తల్లి చనిపోయిన మూడు నెలలకే మేం పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుంచి ఇద్దరం కలిసి ప్రయాణం స్టార్ట్ చేశాం. మా పెళ్లి తర్వాతనే ధన్ రాజ్ కు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వరుస సినిమాలతో మంచి పేరు కూడా వచ్చింది. కానీ ఆయనకు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఆలోచన ఉంటుంది.

Read Also : Venkatesh : ఆ క్రేజీ డైరెక్టర్ తో వెంకటేశ్ సినిమా..?

ఆయన ప్రొడ్యూసర్ గా ధనలక్ష్మీ తలుపు తడితే అనే సినిమా తీశాడు. ఆ మూవీ చేయొద్దని ఎంత చెప్పినా వినలేదు. ఎందుకంటే అది గనక పోతే సర్వం కోల్పోతాం అని తెలుసు. నేను అనుకున్నట్టే ఆ మూవీ వల్ల అన్నీ కోల్పోయాం. మళ్లీ జీరోకు వచ్చేశాం. అక్కడి నుంచి మళ్లీ ప్రయాణం మొదలు పెట్టాం. ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉన్నాం. మా ఇద్దరి నడుమ గొడవలు వస్తూనే ఉంటాయి. కానీ విడిపోలేదు. మీడియాలో మాత్రం విడిపోయాం అన్నట్టు వార్తలు వస్తుంటాయి. అవి మేం పట్టించుకోకుండా ప్రయాణం సాగిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది శిరీష. ఇక ధన్ రాజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.