మాస్ మహారాజ రవితేజకే కాదు కరోనా కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి కూడా ఆక్సిజన్ లాంటి హిట్ ఇచ్చిన ‘క్రాక్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర 70కోట్లు రాబట్టింది. ఏడాది తిరగకుండానే ‘ధమాకా’ సినిమాతో ‘క్రాక్’ కలెక్షన్స్ ని బ్రేక్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. క్రాక్ సినిమా ఓవరాల్ గా క్రాక్ రాబట్టిన 70 కోట్ల మార్క్ ని ధమాకా సినిమా బ్రేక్ చెయ్యడానికి టైం దగ్గర పడింది. పది రోజుల్లో ధమాకా సినిమా 94 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తూనే ఉంది. ధమాకా సినిమా అనౌన్స్ అయినప్పుడు, ఈ మూవీపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. అప్పటికే రవితేజ నటించిన రెండు సినిమాలూ ఫ్లాప్ అవ్వడంతో ధమాకా కూడా పోతుందేమో అని అంతా అనుకున్నారు. అలా అనుకున్న ప్రతి ఒక్కరి అంచనాలని తలకిందులు చేస్తూ ధమాకా సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ థియేటర్ రన్ ని కంటిన్యు చేస్తోంది.
ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతున్న ధమాకా సినిమా, ఇప్పటివరకూ 550K డాలర్స్ ని వసూల్ చేసింది. ఇది రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓవర్సీస్ హిట్ గా నిలిచింది. దీంతో క్రాక్ రికార్డుని ధమాకా సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ చేసినట్లు అయ్యింది. రాబోయే రోజుల్లో ధమాకా సినిమా మరిన్ని వండర్స్ క్రియేట్ చెయ్యడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి జనవరి ఫస్ట్ వీక్ లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావట్లేదు. సంక్రాంతి వరకూ టాలీవుడ్ లో పెద్ద సినిమాలేవి రిలీజ్ కావట్లేదు కాబట్టి ధమాకా సినిమా థియేటర్ రన్ కంటిన్యు అవుతుంది. ప్రస్తుతం ధమాకా మైంటైన్ చేస్తున్న థియేటర్ కౌంట్ లో డ్రాప్ కనిపించకపోతే, కలెక్షన్స్ లో కూడా డ్రాప్ కనిపించే అవకాశం లేదు. ఇప్పుడున్న బాక్సాఫీస్ ట్రెండ్ ని బట్టి చూస్తే ఫుల్ రన్ లో ధమాకా సినిమా ఈరోజుతో వంద కోట్ల బెంచ్ మార్క్ ని టచ్ అవనుంది. రవితేజ కెరీర్ లోనే ఫాస్టెస్ట్ 100 క్రోర్ గ్రసర్ గా హిస్టరీ క్రియేట్ చెయ్యడానికి ధమాకా సినిమా సిద్ధంగా ఉంది.