Devulapalli Krishna shastri: భావకవితకు మేస్త్రి… దేవులపల్లి కృష్ణశాస్త్రి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భావకవులు ఎవరికీ అర్థం కాని పాటలు రాసుకొని తమ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారని కొందరి విమర్శ. అయితే ఊహాలోకంలో విహరించమనే ఐన్ స్టీన్ వంటి మేధావులు సైతం సెలవిచ్చారు. నేటి ఊహ, రేపటి వాస్తవం కావచ్చునని శాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తున్నారు. తెలుగునేలపై భావకవితకు పట్టం కట్టి ఊరూరా, వాడవాడలా పలువురు యువకవులను ఊహాలోకాల్లో విహరింప చేసిన ఘనుడు దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి. ఆయన భావకవితకు జేజేలు పలికారు జనం. వాస్తవికతకు దూరంగా ఉండే భావుకత ఎంతవరకు సమంజసం అంటూ గళమెత్తినవారూ లేకపోలేదు. ఎవరి భావాలు వారివి. కృష్ణశాస్త్రిలోని భావకవిత్వమే ఆ రోజుల్లో పట్టాభిషేకాలు చేసుకుంది. దిగ్దర్శకుడు బి..యన్.రెడ్డిని కూడా కృష్ణశాస్త్రి భావుకత ఆకర్షించింది. తన 'మల్లీశ్వరి'కి తగ్గ రచయిత అని బి.యన్.రెడ్డి భావించి, కృష్ణశాస్త్రి పాటను చిత్రసీమకు పరిచయం చేశారు. అక్కడా కృష్ణశాస్త్రి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. 'ఆకాశవీధిలో హాయిగా ఎగిరే మేఘమాలలతో సందేశాలు' పంపించారు. 'మనసున మల్లెల మాలలు ఊగించారు', ఆ సువాసనలు తెలుగు ప్రేక్షకులను కట్టి పడేశాయి. కృష్ణశాస్త్రి పాటతో పయనించడంలో ఎంతోమంది హాయిని పొందారు. కొందరు హాయి కోసమే కృష్ణశాస్త్రి పాటలతో సాగారు.
అవకాశాలు లభించాయి కదా అని కృష్ణశాస్త్రి పరుగులు తీస్తూ పాటలు రాయలేదు. ఉరకలు వేస్తూ భావుకత పలికించలేదు. సందర్భశుద్ధితోనే ఆయన పాట సాగేది. తరువాతి రోజుల్లో ఆయన పాటకు సినిమాజనం దూరంగా జరిగినప్పుడు కూడా ఏ రోజూ రాజీపడింది లేదు. ఓంకారనాదాను సంధానంతో “ఘనాఘన సుందరుని” కీర్తిస్తూ భక్త తుకారాం నోట పల్లవించిన కృష్ణశాస్త్రి పాట ఏదో ఓ చోట నేటికీ మారుమోగుతూనే ఉంది. ‘అమెరికా అమ్మాయి’కి ఒళ్ళంత వయ్యారి కోక చుట్టి, ఆమెనోట తెలుగు పాట పలికించి పులకింప చేసిన తీరును ఎవరు మాత్రం మరువగలరు? “మావిచిగురు తినగానే కోకిల పలుకుతుందని” అందరికీ తెలుసు, ఆ సత్యాన్ని మరోమారు గుర్తు చేస్తూనే మధురాన్ని మన సొంతం చేశారాయన. ప్రకృతి సౌందర్యంతోనే కృష్ణశాస్త్రి కలం సాగింది.. ‘గోరింట కొమ్మలేకుండా పూచింది…’ అంటూనే మందారంలా పూస్తే మంచిమొగుడొస్తాడు అంటూ కన్నెల మనసుల్లో ఆశలు రేపింది.
‘ఆరనీకుమా ఈ దీపం…” అంటూ ప్రతీ కార్తిక మాసంలో తెలుగునేలపై మహిళలు పాడుకొనేలా ఓ పాటనూ ప్రసాదించింది కృష్ణశాస్త్రి కలం. ‘మేఘసందేశాలు’ పంపడంలో మేటి అనిపించుకున్న కృష్ణశాస్త్రి పలికించిన “ఆకులో ఆకునై… పువ్వులో పువ్వునై…” గేయాన్ని అదేపనిగా సినిమా పాటగా మార్చుకున్న వైనాన్నీ మరువలేం. “జయ జయ ప్రియభారత జనయిత్రీ…దివ్యధాత్రి…” అంటూ కృష్ణశాస్త్రి పలికించిన దేశభక్తి గీతం సైతం అందరినీ అలరించింది… ఆ పాటకు ఇళయరాజా తనవైన బాణీలు కట్టి మరీ మురిపించారు… ఇలా కృష్ణశాస్త్రి పాటతో సాగుతూ ఉంటే మనలోనూ భావకవిత్వం పాటందుకోకమానదు. అదీ కృష్ణశాస్త్రి సాధించిన ఘనకీర్తి. ఆ కీర్తి వెలుగుల్లోనే ఇప్పటికీ ఎందరో భావకవులు భావకవిత్వ సాధన చేస్తున్నారు.
Also Read
- Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
- Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!