Devil Trailer: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా అభిషేక్ నామా దర్శకత్వం వహించి నిర్మిస్తున్న చిత్రం డెవిల్.. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బ్రిటిష్ కాలంలోనే సినిమా మొత్తాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఒక రాజ కుటుంబంలో విజయ అన అమ్మాయి మర్డర్ జరుగుతుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి కళ్యాణ్ రామ్.. ఆ ఇంటికి వెళ్తాడు. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ లో అతనికి ఎన్నో అనుమానాలు ఎదురవుతాయి. ఇక ఈ హత్యకు.. బ్రిటిష్ సీక్రెట్ మిషన్ కు లింక్ ఉందని తెలుసుకున్న అధికారులు.. కళ్యాణ్ రామ్ తో ఆపరేషన్ టైగర్ హంట్ మొదలుపెడతారు. అసలు విజయను హత్యచేసింది ఎవరు.. ? చివరికి డెవిల్.. ఆ మిషన్ ను పూర్తి చేశాడా.. ? లేదా.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
డెవిల్ గా కళ్యాణ్ రామ్ దిగిపోయాడు. సీక్రెట్ ఏజెంట్ గా ఆ లుక్, నటన వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక విరూపాక్ష తరువాత సంయుక్త అందం మెస్మరైజ్ చేస్తోంది. మాళవిక నాయర్ చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తుంది. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. ఇక సినిమాకు ఆయువుపట్టు అంటే హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అని చెప్పాలి. కళ్యాణ్ రామ్ డైలాగ్ డెలివరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివర్లో విశ్వాసం చూపించడానికి.. విధేయతతో ఉండడానికి కుక్కననుకున్నావా.. లయన్ అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. డిసెంబర్ 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.