Devil: వివాదాలతోనే ఫేమస్ అయిన సినిమా.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ తో వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devil: వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసార లాంటి హిట్ తరువాత డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డెవిల్.. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా దర్శకత్వం వహించి నిర్మిస్తున్నాడు. ఎన్నో మంచి చిత్రాను మనకు అందించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థలో రూపొందుతోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ నటిస్తోంది. ప్పటి వరకు విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్ లుక్ కి కూడా చాలా మంచి స్పందన వచ్చింది.
ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేయనటువంటి జోనర్ మూవీ.. భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. దీంతో సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. డెవిల్ సినిమా మొత్తం వివాదాల బారిన పడిన విషయం తెల్సిందే. మొదట ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు. నిర్మాత అభిషేక్ నామాతో అతనికి గొడవలు జరిగాయి. దీంతో నిర్మాత అభిషేక్ .. నవీన్ పేరును తొలగించి డైరెక్టర్ గా తన పేరును వేసుకున్నాడు. ఇక వీరి గొడవలో కలుగజేసుకోవడం ఎందుకని కళ్యాణ్ రామ్ సైతం మౌనంగా ఉన్నాడు. మరి ఈ సినిమా డిసెంబర్ 29 న రిలీజ్ అవుతుంది. సలార్ ను ఢీకొని డెవిల్ ఎలా నిలబడుతుందో చూడాలి.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?