NTV Telugu Site icon

Devil: వివాదాలతోనే ఫేమస్ అయిన సినిమా.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ తో వచ్చింది

Devil

Devil

Devil: వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. బింబిసార లాంటి హిట్ తరువాత డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డెవిల్.. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా దర్శకత్వం వహించి నిర్మిస్తున్నాడు. ఎన్నో మంచి చిత్రాను మనకు అందించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థలో రూపొందుతోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ నటిస్తోంది. ప్పటి వరకు విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్ లుక్ కి కూడా చాలా మంచి స్పందన వచ్చింది.

ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేయనటువంటి జోనర్ మూవీ.. భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. దీంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ప్రేక్ష‌కులు, అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌టం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్నారు. డెవిల్ సినిమా మొత్తం వివాదాల బారిన పడిన విషయం తెల్సిందే. మొదట ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు. నిర్మాత అభిషేక్ నామాతో అతనికి గొడవలు జరిగాయి. దీంతో నిర్మాత అభిషేక్ .. నవీన్ పేరును తొలగించి డైరెక్టర్ గా తన పేరును వేసుకున్నాడు. ఇక వీరి గొడవలో కలుగజేసుకోవడం ఎందుకని కళ్యాణ్ రామ్ సైతం మౌనంగా ఉన్నాడు. మరి ఈ సినిమా డిసెంబర్ 29 న రిలీజ్ అవుతుంది. సలార్ ను ఢీకొని డెవిల్ ఎలా నిలబడుతుందో చూడాలి.

Show comments