NTV Telugu Site icon

Devi Sri Prasad: పెంచు..పెంచు.. హైప్ పెంచు.. నీయవ్వ.. తగ్గేదేలే

Bunny

Bunny

Devi Sri Prasad: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప.ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ గా నిలబెట్టిన సినిమా కూడా పుష్పనే. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే హైప్ లేకుండా ఉంటుందా.. ? లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్క ఈసారి కూడా తప్పదు అని అభిమానుల అంచనా. అందుకు తగ్గట్టుగానే సినిమాను ఓ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మైత్రీ మూవీ మేకర్స్ .. పుష్ప 2 ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పుష్ప ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో.. అంతకు మించి పుష్ప 2 ఉండనుందని చిత్ర బృందంలో ప్రతి ఒక్కరు చెప్పుకొస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

Kareena Kapoor Khan: దేవర విలన్ భార్య డర్టీ ఫోజులు.. మరీ చాప మీద..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దేవిశ్రీ మాట్లాడుతూ.. “పుష్ప 2లో హైస్ మామూలుగా ఉండవు… ప్రతి సీన్ ఇంటర్వెల్ సీన్ అంత హై ఇస్తుంది. సుకుమార్ కథ చెప్తుంటే చాలా సార్లు చప్పట్లు కొట్టాం” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాటలు చాలావా.. హైప్ మీద ఉన్న అభిమానులకు మరింత హైప్ తీసుకురావడానికి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ కామెంట్స్ విన్న అభిమానులు పెంచు..పెంచు.. హైప్ పెంచు.. నీయవ్వ.. తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పుష్ప 2 వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి.

Show comments