Site icon NTV Telugu

Ranveer Singh : సైమాలో రణవీర్ తో దేవరకొండ చిందు

Siima

Siima

విజయ్ దేవరకొండ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఆ తర్వాత వచ్చిన ‘గీతగోవిందం’, ‘టాక్సీవాలా’ హిట్ కావటంతో టాప్ స్టార్ గా ఎదిగాడు విజయ్. స్టార్ డమ్ తో పాటు బడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా సక్సెస్ మాత్రం దరి చేరటం లేదు. ఇటీవల పూరితో కలసి చేసిన ప్యాన్ ఇండియా సినిమా ‘లైగర్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో కెరీర్ పై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే జయాపజయాలు దైవాధీనాలుగా భావించే విజయ్ బిహేవియర్ లో మాత్రం ఎలాంటి తేడా లేదు. ఇటీవల జరిగిన సైమా ఈవెంట్ లో విలేకరులు ‘లైగర్’ పరాజయం గురించి ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా వచ్చింది సైమా వేడుకలకు అంటూ డైవర్ట్ చేశాడు.

ఈ ఈవెంట్ లోనే బాలీవుడ్ స్టార్ రణవీర్ తో కలసి చిందేశాడు విజయ్. ఈ ఇద్దరూ అద్భుతమైన ఆఫ్-స్క్రీన్ ప్రెజన్స్ ఉన్నవాళ్ళే. అందుకేనేమో వీరిద్దరికీ దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆదివారం రణవీర్ సోషల్ మీడియాలో విజయ్ తో కలసి డాన్స్ చేసిన ఫోటో షేర్ చేశాడు. ఇందులో రణవీర్ తెలుపు రంగు దుస్తులలో కనిపించగా, విజయ్ మాత్రం నలుపు రంగు దుస్తులలో డోంట్ కేర్ అన్నట్లున్నాడు. ఈ ఫోటోకు రణ్‌ వీర్ ‘రౌడీ బాయ్స్’ అనే క్యాప్షన్ పెట్టాడు. రణ్ వీర్ షేర్ చేసిన ఈ ఫోటో చూసిన తర్వాత ఈ హీరోల అభిమానులు వారి నృత్య ప్రదర్శనను ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆతృతతో ఉన్నారు. మరి సైమా ఈవెంట్ టెలికాస్ట్ ఏ ఛానెల్ లో ప్రసారం చేస్తుందో చూడాలి.

Exit mobile version