Devara: దేవర vs భైరవ… పార్ట్ 1కి ఇదే క్లైమాక్సా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారుస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాతో ఇంతకుముందెన్నడు చూడని ఎన్టీఆర్‌ను చూడబోతున్నాం. ఇదే విషయాన్ని 80 సెకండ్ల గ్లింప్స్‌తో చెప్పేశాడు కొరటాల శివ. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది దేవర గ్లింప్స్. బ్లడ్ మూన్ షాట్‌తో సోషల్ మీడియా మొత్తం ఎరుపెక్కిపోయింది. ఎర్ర సముద్రం అంటూ… ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. అయితే… ఈ గ్లింప్స్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌లను మాత్రం చూపించలేదు. నెక్స్ట్ రానున్న దేవర టీజర్లో హీరోయిన్, విలన్ ఎంట్రీ ఉంటుంది. ఇదిలా ఉంటే నెక్స్ట్ జరగనున్న షెడ్యూల్లో మాత్రం హీరో, విలన్ పై భారీ ఫైట్ చిత్రీకరించనున్నట్టుగా తెలుస్తోంది.
Read Also: Guntur Kaaram: ఈ రోజు దద్దరిల్లిపోద్ది… SSMB 29 కోసం వెయిటింగ్
Also Read
దేవర వర్సెస్ భైరవ కోసం స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తున్నారట. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్‌ల పై భారీ యాక్షన్ సీన్స్‌ను ఘాట్ చేస్తారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో బిగ్గెస్ట్ ఫైట్‌గా ఉంటుందట. అయితే… హీరో, విలన్ తలపడుతున్నారంటే ఇదే క్లైమాక్స్ ఫైట్ కూడా అయి ఉండొచ్చు కానీ ఈ విషయంలో క్లారిటీ లేదు. అయితే… ఈ యాక్షన్ సీన్స్ విజువల్స్ మాత్రం చాలా వైల్డ్‌గా ఉంటాయట. దేవర చేసే ఊచకోతకు సముద్రమే కాదు… ఏప్రిల్ 5న థియేటర్లు కూడా ఎరుపెక్కనున్నాయి. దేవర సినిమాను దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’ గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల నుంచి వస్తున్న సినిమా కావడంతో… రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!