ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ AI క్రియేటెడ్ ఫోటోస్. ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ AI జనరేటెడ్ ఇమేజస్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ స్టైలిష్ ఫోటోస్ అండ్ మహేష్ రాక్ సాలిడ్ ఫీజిక్ ఉన్న ఫోటోస్ అయితే ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేస్తున్నాయి. ఈ AI ఇమేజస్ లో ఉన్న రేంజులో ప్రభాస్, మహేష్ ఒక్క సినిమా చేసినా పాన్ ఇండియా షేక్ అయిపోద్ది. ఇప్పుడు ఈ రేస్ లోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా AI జనరేటెడ్ ఇమేజస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వాటన్నింటినీ మించే రేంజులో ఒక ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిప్డ్ ఫీజిక్ తో, లాంగ్ హెయిర్ అండ్ స్టైలిష్ బియర్డ్ లుక్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్… పులితో పోరాడుతున్నాడు.
ఈ ఇమేజ్ చూస్తుంటే యంగ్ టైగర్ ఇంకో టైగర్ కి మధ్య యుద్ధం జరుగుతున్నట్లు ఉంది. ఈ ఒక్క ఇమేజ్ ఇంతకముందు వచ్చిన ఎన్టీఆర్ AI ఇమేజస్ ని మర్చిపోయేలా చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ట్రక్ జంప్ సీన్ తో వరల్డ్ వైడ్ సెన్సేషన్ గా మారిన ఎన్టీఆర్, ఈ AI ఇమేజ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్ ని సినిమాలో నిజంగానే చేస్తే మాత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమా సీన్ ని ఆడియన్స్ మర్చిపోతారు. ఇలాంటి సీన్ ని చేయడం కష్టమే అయినా చేస్తే మాత్రం బాగుంటుంది. ఇక దేవర విషయానికి వస్తే కొరటాల శివ, దేవర సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు. మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అని చెప్పిన కొరటాల శివ… ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపించనున్నాడు. పాన్ ఇండియా బాక్సాఫీస్ టార్గెట్ గా రానున్న ఈ మూవీతో ఎన్టీఆర్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.