Site icon NTV Telugu

Devara Fear Song : దేవర సాంగ్ వచ్చేసింది.. అనిరుథ్ అరిపించాడు మావా!

Devara Fear Song

Devara Fear Song

Devara Fear Song Out Now: మాన్‌ ఆఫ్‌ మాసెస్‌ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర. ఆచార్య తరువాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతోందని ఇప్పటికే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో ఈ ఫస్ట్ పార్టును అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Good Bad Ugly: ఈసారి సంక్రాంతికి అజిత్ ను దించుతున్న మైత్రీ మూవీ మేకర్స్

ప్రమోషన్స్ లో భాగం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఒక్కరోజు ముందే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటించిన దాని మేరకు సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలుగు సహా హిందీ, తమిళ వెర్షన్స్ కి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తూనే సాంగ్ పాడాడు. మూడు నిముషాల 16 సెకన్ల నిడివి గల ఈ సాంగ్ అయితే గూజ్ బంప్స్ గ్యారెంటీ మెటీరియల్ లా అనిపిస్తోంది. ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.

Exit mobile version