NTV Telugu Site icon

Devara: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. మరో వెయ్యి కోట్లు లోడింగ్?

Devara

Devara

ముందుగా యంగ్ టైగర్ చెప్పినట్టే.. నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర పార్ట్ 1.. సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ అయి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దేవర దెబ్బకు వసూళ్ల సునామి కురుస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఊచకోతకు పలు రికార్డులు ఎగిరిపోతున్నాయి. ఫస్ట్ డే ‘దేవర’ ఊహించని ఓపెనింగ్ సాధించింది. ట్రేడ్ వర్గాలు 130 నుంచి 150 కోట్లు రాబడుతుందని అంచనా వేశాయి కానీ దేవర ముంగిట మీరెంత అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా అక్షరాల నూట డబ్బె రెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని.. దేవర ధాటికి బాక్సాఫీస్ తగలబడిపోయేలా ఉందని అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్. ఇక రెండో రోజు వీకెండ్ అవడంతో.. దేవర వసూళ్లు భారీగా ఉండనున్నాయి. సెకండ్ డే అనే కాదు.. దసరా వరకు దేవరకు తిరుగేలేదు. కాబట్టి.. ఈ సినిమా వెయ్యి కోట్లు రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

Also Read: Rajinikanth: లడ్డు వివాదం పై మాట్లాడడానికి నిరాకరించిన సూపర్ స్టార్ రజినీకాంత్

ఫస్ట్ డే 172 కోట్లంటే.. రెండో రోజు ఎంత కాదనుకున్న 150 కోట్ల పోస్టర్ బయటికి వచ్చే ఛాన్స్ లేకపోలేదు. కాబట్టి.. రెండు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయి దేవర సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే. అలాగే.. ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ప్రకారం.. 3 రోజుల్లో 500 కోట్ల పోస్టర్ వచ్చిన రావొచ్చు అంచనా. ఇక దసరా వరకు లాంగ్ హాలీడేస్ ఉన్నాయి కాబట్టి వెయ్యి కోట్ల క్లబ్‌లో దేవర ఎంటర్ అవడం ఖాయం అంటున్నారు. ఇదే జరిగితే.. ప్రభాస్ తర్వాత రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న హీరోగా ఎన్టీఆర్ సంచలనం సృష్టించినట్టే. కాకపోతే.. ఆర్ఆర్ఆర్ వసూళ్లు మాత్రం చరణ్, తారక్ ఇద్దరికీ వర్తిస్తాయి. కానీ.. తెలుగులో రాజమౌళి తర్వాత కొరటాల వెయ్యి కోట్ల దర్శకుడిగా రికార్డ్ క్రియేట్ చేసినట్టే. ఏదేమైనా.. టాక్‌తో సబంధం లేకుండా దేవర మాత్రం ఊహించని విజయాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఖచ్చితంగా లాంగ్ రన్‌లో దేవర లెక్కలు పలు రికార్డులు బద్దలు చేయడం గ్యారెంటీ.