Site icon NTV Telugu

Devara: దేవర ఆయుధ పూజకు ముహూర్తం ఫిక్స్.. రెడీ అవండమ్మా!

Devara Ayudhapooja

Devara Ayudhapooja

Devara Ayudha Pooja Song getting Ready: దేవర క్రేజ్ చూస్తే.. ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్‌కు సోషల్ మీడియా తగలబెట్టేలా ఉన్నారు టైగర్ ఫ్యాన్స్. ముఖ్యంగా అమెరికాలో దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అక్కడి మ్యూజిక్ కాన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోతున్నారు ఆడియెన్స్. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా షేర్ చేసుకుంది. ఇక చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్‌లో.. ఇప్పటికే 110 మిలియన్ వ్యూస్ రాబట్టి.. టాప్ ట్రెండ్ అవుతోంది. ఇలా సోషల్ మీడియాను షేక్ చేస్తునే ఉంది దేవర. అదే సమయంలో దేవర థర్డ్ సాంగ్ అప్డేట్ కూడా వైరల్ అవుతోంది. దేవర నుండి మూడవ లిరికల్ సాంగ్‌ను వినాయక చవితి సందర్భంగా.. సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి

అయితే.. చిత్ర యూనిట్ నుంచి దీని పై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈసారి దేవర నుంచి రాబోయే పాట ఎలా ఉండబోతుందనే ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు అభిమానులు. ఎందుకంటే.. ఇటీవల చిత్ర యూనిట్ ఆయుధ పూజకు సంబంధించిన సాంగ్ ఒకటి షూట్ చేశామని.. ఆ పాటకు అంతా పోతారు అనేలా హైప్ ఎక్కించారు. అంతేకాదు.. ఓ 20-30 సెకన్ల బిట్ కూడా లీక్ అవగా.. ఆయుధ పూజ పై అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఇదే సాంగ్‌ను రిలీజ్ చేస్తారా? లేదంటే మరో కొత్త పాటను విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. దీంతో.. ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఏదేమైనా.. దేవర పై అంచనాలు మామూలుగా లేవనే చెప్పాలి.

Exit mobile version