Deva Katta : డైరెక్టర్ దేవాకట్ట స్టైలే సెపరేట్ గా ఉంటుంది. ఆయన ఏది పడితే అది అస్సలు చేయరు. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అయిపోతున్నా ఇప్పటికి చేసింది. నాలుగు సినిమాలే. ఇక రైటర్ గా మాత్రం ఎన్నో సినిమాలకు పనిచేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలకు ఆయన రాసే డైలాగులు ఎంతో ఆకట్టుకుంటాయి. అప్పట్లో బాహుబలికి కొన్ని డైలాగులు రాశారు. ఇప్పుడు మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాకు డైలాగ్ రైటర్ గా దేవాకట్ట పనిచేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దానిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ.. ఆ మూవీకి తనకు సంబంధం లేదన్నారు.
Read Also : Kingdom : కింగ్ డమ్ పార్ట్-2 వచ్చేది అప్పుడే.. నాగవంశీ క్లారిటీ
తాను రాజమౌళి-మహేశ్ కాంబోలో వస్తున్న మూవీకి పనిచేయట్లేదని తెలిపారు. రెగ్యులర్ గా రాజమౌళిని కలుస్తూ ఉంటాను. చాలా విషయాల గురించి ఇద్దరం చర్చించుకుంటాం. కానీ ఈ సినిమాకు పనిచేయట్లేదు అని తెలిపారు. దేవాకట్ట ప్రస్తుతం ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో మయసభ అనే సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ ట్రైలర్ నేడు రిలీజ్ చేయగా మంచిరెస్పాన్స్ వస్తోంది. దేవాకట్ట చివరగా సాయిధరమ్ తేజ్ తో రిపబ్లిక్ సినిమా చేశాడు. ఆ మూవీతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సాధించాడు.
Read Also : Sonusood : సోనూసూద్ గొప్ప మనసు.. మరో కీలక ప్రకటన..
