పాన్ ఇండియా సినిమాలకు షాక్… థియేటర్లు బంద్ తో టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022 సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలకు ఇది కష్ట సమయం. పెరుగుతున్న కోవిడ్, ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి కొన్ని బహిరంగ ప్రదేశాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తూ, ఈ రోజు ఢిల్లీలోని థియేటర్లను తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు అక్కడ. మరోవైపు మహారాష్ట్రలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ, థియేటర్లలో 50% ఆక్యుపెన్సీతో ఆంక్షలు నడుస్తున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద చిత్రాలకు ఇది భారీ దెబ్బ అని చెప్పొచ్చు.
ఒక వికెట్ పడగొట్టేసిన ఒమిక్రాన్ !
ఈ శుక్రవారం విడుదల కావాల్సిన షాహిద్ కపూర్ ‘జెర్సీ’ ఈ ఢిల్లీ నిర్ణయం వెలువడగానే విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ కారణంగా ఇప్పటికే ముంబైలోని థియేటర్లు సెకండ్ షోను ప్రదర్శించడం లేదు. అందుబాటులో ఉన్న థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా టిక్కెట్ ధరల సమస్య తారాస్థాయికి చేరడంతో చాలా తెలుగు సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల మధ్య ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘రాధేశ్యామ్’ టీమ్స్ ఏం చేయబోతున్నాయి ? అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’లకు కష్ట సమయం
పెద్ద నిర్మాతలు, పంపిణీదారులు ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ రెండింటి విడుదల గురించి చర్చించడానికి అత్యవసరంగా సమావేశం అయ్యారని సమాచారం. ప్రమోషన్ల కోసం ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు వెనక్కి తగ్గితే భారీ నష్టం చవిచూడక తప్పదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్లతో పాటు అనేక సహ-బ్రాండెడ్ ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకవేళ సినిమా పోస్ట్ పోన్ అయితే మళ్లీ ఇదంతా చేయడం చాలా కష్టం. అయితే ఢిల్లీ కోసమే సినిమాను వాయిదా వేయడం జరగని పని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు కరోనా వ్యాప్తిని తగ్గించడానికి, రాబోయే నూతన సంవత్సర వేడుకల గురించి రాష్ట్రాలు అతిగా స్పందిస్తున్నాయని అభిప్రాయమా వ్యక్తం చేస్తున్నారు కొందరు. జనవరి 1వ వారంలో పెద్దగా కరోనా లేదా ఒమిక్రాన్ కేసుల సంఖ్యా పెరగక పోతే జనవరి 10 నాటికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. రాత్రి కర్ఫ్యూలు కూడా ఎత్తేసే అవకాశం ఉంటుంది. మరి ఏం జరగబోతోందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!