NTV Telugu Site icon

షణ్ముఖ్ తో దీప్తి సునైనా బ్రేకప్… సుదీర్ఘ పోస్టుతో షాక్

deepthi-and-Shanmukh

బిగ్ బాస్-5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి సునైనా బ్రేకప్ గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే నిన్న ఈ విషయాన్నీ దీప్తి అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ జంట గురించి బుల్లితెరతో పాటు నెటిజన్లలోనూ తరచుగా చర్చ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా దీప్తి, షణ్ముఖ్ మధ్య విబేధాలు వచ్చాయంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఆ రూమర్స్ ను నిజం చేస్తూ దీప్తినే స్వయంగా బ్రేకప్ విషయాన్నీ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది దీప్తి.

Read Also : వీడియో : ‘స్వాగ్ ఆఫ్ భోళా శంకర్’… మెగా మాస్

దీప్తి సునైనా తన బాయ్‌ఫ్రెండ్ షన్ను పుట్టినరోజు సందర్భంగా ‘బిగ్ బాస్ 5’ హౌజ్ లో ఉన్న షణ్ముఖ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే తాజా సీజన్ లో పాల్గొన్న షన్ను ప్రవర్తనతో వీరిద్దరి విషయం తీవ్ర మలుపు తిరిగింది. షన్ను మరో హౌస్‌మేట్ సిరి హన్మంత్‌తో సన్నిహితంగా ఉండటమే కాకుండా, సిరిని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం కూడా ఆయనకు ఎఫెక్ట్ అయ్యింది. అలాగే హౌస్‌లో షణ్ణు చేసినపనులే దీప్తిని చాలా బాధించాయని అంటున్నారు. ‘బిగ్ బాస్-5’ నుంచి షన్ను బయటకు వచ్చాక ఇద్దరూ బహిరంగంగా కనిపించకపోవడంతో షణ్న-దీప్తి బ్రేకప్ పుకార్లు తెరపైకి వచ్చాయి. దీప్తి సునైనా ఇన్‌స్టాగ్రామ్‌లో షన్నూని అన్‌ఫాలో చేసింది. అదే ఇద్దరూ విడిపోయే అవకాశం ఉందనే ఊహాగానాలకు దారితీసింది. దీప్తి ఇప్పుడు తన తాజా సోషల్ మీడియా పోస్ట్‌లో తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్‌తో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది.

Show comments