బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. పెళ్లి తరువాత కూడా అమ్మడు స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. ఇకపోతే ప్రస్తుతం దీపికా , షారుఖ్ సరసన పఠాన్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే అమ్మడు హాట్ హాట్ బికినీ ఫొటోలు సెట్ నుంచి లీక్ అవ్వడం .. అవి కాస్తా వైరల్ అవ్వడం తెల్సిందే. ఆ ఫోటోలు లీక్ అవ్వడానికి కూడా కారణం లేకపోలేదు. స్పెయిన్లో బహిర్గత ప్రదేశంలోనే షూటింగ్ చేయడం.. అందులోనూ పెద్దగా సెక్యురిటీ లేకపోవడంతో మీడియా వారు, సాధారణ అభిమానులు కెమెరాలను క్లిక్ మనిపించడం, నెట్ లో పెట్టేయడం, అవి కాస్తా వైరల్ గా మారడం జరిగిపోయాయి. ఇక ఆ ఫోటోలు లీక్ అవ్వడంపై దీపికా కాస్తా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవలే షూటింగ్ స్పాట్ కి వచ్చిన మీడియాపై అమ్మడు ఆగ్రహం వ్యక్తం చేసింది. మిడిల్ ఫింగర్ ని మీడియాకు చూపించి తన కోపాన్ని వెళ్లగక్కింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అమ్మడు మిడిల్ ఫింగర్ చూపిస్తునప్పుడు షారుఖ్ పక్కనే ఉండడం గమనార్హం. ఇక దీపికా చేసిన పనికి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత పొగరు.. మీడియాకే మిడిల్ ఫింగర్ చూపిస్తుందా..? సినిమా సెట్ నుంచి ఫోటోలు లీక్ అవ్వడం సహజం.. అందుకే అమ్మడు ఇంతగా రెచ్చిపోవాలా..? దీపికా కొంచెం ఎక్కువ చేస్తున్నట్లు లేదు.. అంటూ నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
