Deepika Padukone : దీపిక పదుకొణె ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటుంది. ఓ వైపు అల్లు అర్జున్-అట్లీ సినిమాలో కనిపిస్తోంది. దాంతో పాటు మరో సినిమాను కూడా రెడీగా ఉంచింది. అటు కల్కి-2 సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన కూతురు దువాతో టైమ్ స్పెండ్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె తన కూతురుతో కలిసి బయటకు వెళ్లింది. తిరిగి ముంబైకి వస్తున్న టైమ్ లో ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి సీక్రెట్ గా దీపిక, దువాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.
Read Also : Ananya Pande : హెడ్ లైట్స్ బాలేవంటూ ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్..
అది చూసిన దీపిక సీరియస్ అయింది. తన పర్మిషన్ లేకుండా దువా ఫేస్ ను సోషల్ మీడియాలో రివీల్ చేయడం మంచిది కాదని తెలిపింది. డిలీట్ చేయాలని కోరింది. రణ్ వీర్ సింగ్, దీపిక తమ కూతురు దువా ఫొటోలను తీయొద్దంటూ ఇప్పటికే ఫొటోగ్రాఫర్లకు రిక్వెస్ట్ చేశారు. అందుకే ఎవరూ ఆమె ఫొటోలను, వీడియోలను తీయట్లేదు. దువా గురించి వాళ్లు పబ్లిసిటీ ఇవ్వాలని అనుకోవట్లేదు. ఆమె ఫేస్ ను రివీల్ చేయకుండా ఉండేందుకు చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Coolie : ‘కూలీ’లో పాత్ర అన్యాయం అంటూ ప్రచారం.. స్పందించిన శృతిహాసన్..
