Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికాకు ఏమైంది..? ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న దీపికా ఆరోగ్యం గత కొన్నిరోజులుగా బాగోడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రాజెక్ట్ కె షూటింగ్ కు హైదరాబాద్ వచ్చిన దీపికా సెట్ లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని నార్మల్ చెకప్ కోసం వెళ్లిందని మేకర్స్ తెలిపారు. ఇక తాజాగా మరోసారి దీపికా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ముంబైలోనిఒ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆమె అన్ని టెస్టులు చేయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల పఠాన్ సినిమా సెట్ లో కూడా దీపికా కళ్ళు తిరిగి పడిపోయిందట. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇలా ప్రతిసారి దీపికా ఎందుకు పడిపోతుంది.. ? ఆమె ఆరోగ్యానికి ఏమైంది..? అని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ దీపికా ప్రెగ్నెంట్ అయిందేమో అని మరికొందరు అనుమానిస్తున్నారు. అయితే అలాంటిదేమి లేదని ఆమె పని ఒత్తిడి వలన ఎక్కువ అనారోగ్యానికి గురవుతుందని అమ్మకొందరు చెప్పుకొస్తున్నారు. ఇందులో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియదు కానీ.. దీపికా మాత్రం ఇలాంటివాటిని పట్టించుకోకుండా తన వర్క్ మీద ఫోకస్ పెడుతుంది. మరి ఆమె ఆరోగ్యానికి ఏమైంది అనేది ఆమె నోరువిప్పితే బావుంటుందని బి టౌన్ అభిమానులు చెప్పుకొంటున్నారు.