దీపికా, రణవీర్ సింగ్… రియల్ లైఫ్ లో ప్రేమికులు, భార్యాభర్తలైన ఈ జంట రీల్ లైఫ్ లోనూ చాలా సార్లే రొమాన్స్ చేశారు. మరీ ముఖ్యంగా, దర్శకుడు సంజయ్ లీలా బాన్సాలీ సినిమాల్లో మూడు సార్లు కలిసి నటించారు. ‘రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్’లో దీపిక, రణవీర్ నటనకి జనం మురిసిపోయారు. అయితే, ముచ్చటగా మూడుసార్లు బన్సాలీ డైరెక్షన్ లో నటించిన బాలీవుడ్ హాట్ పెయిర్ నాలుగోసారి మాత్రం నటించే చాన్స్ మిస్ అయ్యారు. అందుక్కారణం మిసెస్ రణవీరే!
దీపికా ఈ మధ్య రెమ్యూనరేషన్ విషయంలో నిక్కచ్చిగా ఉంటోంది. భారీగా డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఆమెకున్న బాక్సాఫీస్ క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు అడిగినంతా ఇస్తున్నారు కూడా. అయితే, తాజాగా సంజయ్ బన్సాలీ ఆమెని అప్రోచ్ అయితే రణవీర్ తో సమానంగా తనకూ ఫీజు చెల్లించాలని పట్టుబట్టిందట! బన్సాలీ నెక్ట్స్ మూవీ ‘బైజు బావ్రా’. 1952 నాటి క్లాసిక్ మూవీకి ఇది రీమేక్. అయితే, మొదట్లో రణబీర్ కపూర్ హీరో అనుకున్నారు. కానీ, ఆయన లాస్ట్ మూమెంట్ లో రిజెక్ట్ చేయటంతో ‘బైజు బావ్రా’ రీమేక్ రణవీర్ ఖాతాలో పడింది. కానీ, ఫీమేల్ లీడ్ ఎవరు? అందరూ దీపికనే అనుకున్నారు!
Read Also : మహేశ్ సోదరి న్యూ ఇన్నింగ్స్ ‘మళ్లీ మొదలైంది’!
‘బైజు బావ్రా’ ఒరిజినల్ వర్షన్ లో భరత్ భూషణ్, మీనా కుమారి జంటగా నటించారు. దీపికని మీనా కుమారి క్యారెక్టర్ లో ప్రేక్షకులకి చూపించాలని బన్సాలీ భావించాడట. కానీ, అది వర్కవుట్ కాలేదు. డీపీ తనకు హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ కావాలందట. పైసా తగ్గినా కుదరదని తేల్చి చెప్పిందట. మరి దర్శకనిర్మాత బన్సాలీ ఏం చేస్తాడు? నెక్ట్స్ బెస్ట్ ఆప్షన్ కోసం మరోసారి అందగత్తెల్ని అందరి పరికిస్తున్నాడట!
దీపిక నో చెప్పటంతో రణవీర్ తో ‘బైజు బావ్రా’ లాంటి క్లాసిక్ లో ఎవరు రొమాన్స్ చేస్తారోనని బాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. అలాగే, పదుకొణే రేటు విషయంలో పట్టుదలగా ఉండటం కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కొన్నాళ్ల క్రితమే కరీనా కపూర్ ఓ సినిమా కోసం 12 కోట్లు డిమాండ్ చేసింది. చూడబోతే బీ-టౌన్ బిగ్ బ్యూటీస్ అంతా తమ పారితోషికం అమాంతం పెంచేసే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది!
