Site icon NTV Telugu

Deepika padukone: ఆమె ఇంట్రెస్ట్ అంతా బన్నీ, తారక్ లపైనే ఉందంట..

deepika padukone

deepika padukone

ప్రస్తుతం బాలీవుడ్ దృష్టి అంతా టాలీవుడ్ పైనే ఉంది. సినిమా డైరెక్టర్ల దగ్గర నుంచి హీరో,. హీరోయిన్ల వరకు టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు టాలీవుడ్ హీరోలతో నటించడానికి మొగ్గు చూపుతున్నారు. మొన్నటికి మొన్న అలియా భట్, తారక్ తో నటించడం ఇష్టమని చెప్పడమే కాకుండా ఆ ఛాన్స్ కూడా పట్టేసింది. ఇక తాజాగా దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకుంది. ఇప్పటికే ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ కె లో నటిస్తున్న అమ్మడు మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. తాజాగా దీపికా నటిస్తున్న  ‘గెహ్రైయాన్’ సినిమా అమెజాన్ లో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.

ఇకఈ సినిమా ప్రమోషన్లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో “ఇప్పటి వరకు మీరు నటించిన వారు కాకుండా నటించని ఇండియన్ స్టార్స్ లో ఎవరితో మీరు నటించాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు టక్కున దీపికా.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ తో నటించాలని ఉంది అని చెప్పేసి షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ తో నటించాలని చాలా ఆసక్తిగా ఉందని, అలాగే అల్లు అర్జున్ తో కూడా నటించాలని ఉందని” చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న బన్నీ, ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయాయి. వీరిద్దరూ బాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ ను దక్కించుకుని బాలీవుడ్ హీరోయిన్ల దృష్టిలో సూపర్ హీరోస్ గా మారిపోయారు.

https://twitter.com/i/status/1491791651744120832

Exit mobile version