బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హైదరాబాద్ లో అడుగు పెట్టింది. ప్రభాస్ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి దీపికా ఇక్కడికి వచ్చింది. డిసెంబర్ 4న హైదరాబాద్ వెళుతుండగా ముంబై విమానాశ్రయంలో దీపికా కనిపించడంతో ఫొటోగ్రాఫర్లు కెమెరాలకు పని చెప్పారు. దర్శకుడు నాగ్ అశ్విన్ నెక్స్ట్ మూవీతో దీపికా పదుకొణె టాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తాత్కాలికంగా “ప్రాజెక్ట్ కే” అని పేరు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ కోసమే దీపికా తాజాగా హైదరాబాద్ కు చేరుకుంది.
Read Also : ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ అంటే ‘భీమ్లా నాయక్’కి భయం లేదట!
ఇందులో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలో పోషిస్తున్న విషయం తెలిసిందే. “ప్రాజెక్ట్ కే” ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం. వైజయంతీ మూవీస్ నిర్మించిన పాన్-ఇండియా చిత్రం 2022లో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ప్రముఖ చిత్రనిర్మాత సింగీతం శ్రీనివాసరావు బృందానికి మెంటార్‌గా వ్యవహరించనున్నారు. సినిమాటోగ్రాఫర్ డాని శాంచెజ్ లోపెజ్, కంపోజర్ మిక్కీ జె మేయర్ సాంకేతిక సిబ్బందిలో భాగమయ్యారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ “ప్రాజెక్ట్ కే” మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు.
ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాలతో బిజీగా ఉన్న ఉన్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన బల్క్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ప్రముఖ రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ సినిమాలో ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు.