Dear Uma: అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉండదు.. ఆకట్టుకుంటున్న డియర్ ఉమ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dear Uma: ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం.. అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం.. దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా ఇప్పుడు సుమయ రెడ్డి తన బహు ముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం త్వరలోనే రాబోతోంది. ఇందులో సుమయ రెడ్డి, దియా మూవి ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా.. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్వవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు.వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.
ఇక ఈ టీజర్ చూస్తుంటే ఇదొక ప్రేమ కావ్యంలా అనిపిస్తుంది. ప్రేమ ఇచ్చే సంతోషాన్ని, బాధను ఓ దృశ్యకావ్యంగా మలిచినట్టు అనిపిస్తుంది. ‘నా కణాల్లో జీవం నీ కళ్లు.. నా నరాల్లో ప్రవాహాం నీ చూపు’, ‘ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన నిర్వచనం’, ‘అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉండదు.. అమ్మాయిల స్వార్థంలోనే ప్రేమ ఉంటుంది.. అమ్మాయిలు ఇచ్చే షాక్‌లకు.. అబ్బాయిలకు ఇదే సరైన మెడిసిన్’ అనే డైలాగ్స్ సినిమాలోని డెప్త్‌ను చాటుతున్నాయి. అందమైన ప్రేమ కథా చిత్రంగా డియర్ ఉమ రాబోతోందని టీజర్‌తో స్పష్టమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
తాజావార్తలు
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!