DC Movies: సరికొత్త సూపర్ హీరోని ఇంట్రడ్యూస్ చేసిన DC
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఎన్నో కుల మతాలు ఉంటాయి కానీ సినిమా అభిమానులకి మాత్రం రెండు మతాలే ఉంటాయి. అందులో ఒకటి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అయితే మరొకటి డిస్నీ కామిక్స్ యూనివర్స్. మూవీ లవర్స్ ఈ రెండు మతాలుగా విడిపోయి సినిమాలు చూస్తూ ఉంటారు. మా యూనివర్స్ గొప్ప అంటే కాదు మా యూనివర్స్ మాత్రమే గ్రేట్ అంటూ తరచుగా డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ లిస్టులో కొత్తగా చేరాడు ‘బ్లూ బీటిల్’. డిస్నీ కామిక్స్ నుంచి పుట్టిన ఈ సూపర్ హీరో బ్యాక్ స్టొరీ చూస్తే కాస్త మార్వెల్ సూపర్ హీరో స్పైడర్ మాన్ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. స్పైడర్ కుట్టడం, అక్కడి నుంచి అతను స్టార్ హీరో అవ్వడం… ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఫ్రెండ్స్… ఇలా మనలాంటి ఒక రెగ్యులర్ మనిషి స్పైడర్ మాన్ అవుతాడు. దాదాపు ఇలాంటి కథే ‘బ్లూ బీటిల్’ది కూడా. రీసెంట్ గా కాలేజ్ గ్రాడ్యువేషన్ కంప్లీట్ చేసుకున్న జైమ్ రేయెస్, తన భవిష్యత్తు పైన ఎంతో హోప్ తో ఇంటికి తిరిగి వస్తాడు. అయితే అతను ఇంటి నుంచి వెళ్లినప్పుడు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉందో అది తిరిగొచ్చిన తర్వాత జైమ్ రేయెస్ కి కనిపించదు. ఈ ప్రపంచంలో అసలు తన పర్పస్ ఏంటి అనేది కనుగొనడానికి జైమ్ రేయెస్ శోధిస్తున్నప్పుడు, జైమ్ ఊహించని విధంగా ‘ది స్కారాబ్’ అతని చేతికి చేరుతుంది.
ఇక్కడి నుంచి జైమ్ రేయెస్ కాస్త సూపర్ హీరో బ్లూ బీటిల్ గా మారాడు. ఆగస్ట్ 18న విడుదల కానున్న ఈ సూపర్ హీరో సినిమా ట్రైలర్ ని మేకర్స్ అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. జోలో టైటిల్ హీరో రోల్ ప్లే చేసిన ఈ మూవీని ఏంజెల్ సోటో డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ అయితే ఇంటరెస్టింగ్ అండ్ గ్రాండ్ గా ఉంది. ఫన్, ఫ్యామిలీ, అడ్వెంచర్ సెటప్ లో డిజైన్ చేసిన ఏ సూపర్ హీరో క్యారెక్టర్ అయినా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. థార్, స్పైడర్ మాన్, ఐరన్ మాన్ పాత్రలే అందుకు ఉదాహారణ, ఇప్పుడు ఇవే ఎలిమెంట్స్ తో బ్లూ బీటిల్ వస్తున్నాడు. మరి ఆడియన్స్ ఈ సరికొత్త సూపర్ హీరోని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాలి అంటే ఆగస్ట్ 18 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
He’s A Superhero, Whether He Likes It Or Not #BlueBeetle – Only in Theaters August 18 pic.twitter.com/VLYVp1yIrH
— DC (@DCOfficial) April 3, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!